ఏ రంగంలో అయిన ఒక వ్యక్తికి సక్సెస్ వచ్చిన తర్వాత క్రిందికి చూడటం మానేస్తాడు అనేది చాలా మంది చేసే విమర్శలు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకి ఎక్కువగా ఈ రకంగా విమర్శిస్తూ ఉంటారు. అలాగే మెగాస్టార్ లాంటి తండ్రి ఉంటే ఇక రామ్ చరణ్ లాంటి కొడుకు క్రిందికి చూడాల్సిన అవసరం ఏముంది. వారి కళ్ళు ఎప్పుడూ పైనే ఉంటారు. ఎవరిని లెక్కచేయరు అని అనుకుంటారు. కాని రామ్ చరణ్ విషయం అది పూర్తిగా విరుద్ధం అని చెప్పాలి.
మెగాస్టార్ లాంటి తండ్రి ఉన్నా కూడా కోట్లలో పుట్టి పెరిగిన కూడా సింపుల్ గా బ్రతకడానికి ఇష్టపడతాడు. అతని లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. అలాగే అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు.
ఎవరిని కూడా ఏకవచనంతో సంబోధించే రకం కాదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ తెచ్చుకున్నాడు. ప్రపంచం మొత్తం అతని గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. అయితే ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండటం అనేది తాను అలవాటు చేసుకున్నా అని రామ్ చరణ్ అంటున్నారు.
అలాగే పొగడ్తలకి పొంగిపోయి గర్వపడే వ్యక్తిని కాదని చెబుతున్నాడు. అయితే తన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా పెంచుకోవడంలో తనకి అయ్యప్ప మాల ఎంతో ఉపయోగపడింది అని చెప్పారు. అయ్యప్ప మాలధారణ సమయంలో కటిక నేలపైన పడుకుంటాను.
అలా పడుకోవడం వలన సామాన్యుడి కష్టాలు అర్ధమవుతాయి. సామాన్యుడి జీవితం బ్రతకడం అలవాటు అవుతుంది. చాలా మంది నటులు ఒక రేంజ్ ని చూసిన తర్వాత చాలా రకాల ఆలోచనలో దారి తప్పే అవకాశం ఉంటుంది.
అయితే నేను మాత్రం కంట్రోల్ లో ఉండటానికి అయ్యప్ప దీక్ష నాకు ఎంతో ఉపయోగపడుతుంది అని రామ్ చరణ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మరో మూడు రోజులలో ఆస్కార్ అవార్డులలో ఆర్ఆర్ఆర్ సత్తా ఏంటి అనేది తెలిసిపోతుంది. తరువాత మళ్ళీ ఇండియా వచ్చి రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.