అందరూ అనుకుంటున్నదే.. మొన్న బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి చూచాయిగా చెప్పిందే.. నిజమైంది. ఈ నెల 16న, బ్రూస్ లీ విడుదల రోజు చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతోంది. ఈ విషయాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ స్వయంగా వెల్లడించాడు. సినిమా ఎప్పుడు మొదలయ్యేది కూడా చెప్పేశాడు చరణ్.
‘‘అక్టోబర్ 16న నాన్నగారి 150వ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది. దానిగురించి ఇప్పుడే ఏమీ చెప్పను. జనవరి తర్వాత ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది’’ అని చరణ్ వెల్లడించాడు. తాను కూడా మరో రెండు నెలల పాటు ఖాళీగా ఉండబోతున్నాను కాబట్టి.. ఇక తన తండ్రి 150వ సినిమా మీదే పూర్తి శ్రద్ధ పెడతానని చరణ్ చెప్పాడు. తన 150వ సినిమా విశేషాల్ని ‘బ్రూస్ లీ’ సినిమా విడుదల రోజు చరణ్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయిని ఆడియో ఫంక్షన్లో చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. చిరు కత్తి రీమేక్ నటిస్తాడని.. వినాయక్ దర్శకత్వం వహిస్తాడని..కొన్ని రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా చరణ్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామని.. ఆ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడని.. డిసెంబర్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తామని చరణ్ వెల్లడించాడు. గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చర్చల దశలో ఉందని.. అది యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని చరణ్ చెప్పాడు.