పరిశ్రమలో సవాలక్ష రాజకీయాలుంటాయి-చరణ్

Update: 2015-10-22 07:30 GMT
హీరోలంటే ఎప్పుడూ సినీ పరిశ్రమలోని పాజిటివ్ సైడ్ గురించే మాట్లాడుతుంటారు. కానీ చరణ్ నెగెటివ్ సైడ్ గురించి మాట్లాడుతున్నాడు. సినీ పరిశ్రమలో సవాలక్ష రాజకీయాలుంటాయని అంటున్నాడు. సడెన్ గా ఇప్పుడీ రాజకీయాల ప్రస్తావన ఎందుకొచ్చిందీ అంటే.. నిహారిక తెరంగేట్రం విషయంలోనే. నిహారిక సినిమాల్లోకి రావడంపై ఏమంటారు అంటే.. ‘‘నిహారిక టీవీ షోలు బాగా పెర్ఫామ్ చేసింది. ఇప్పుడిక హీరోయిన్ గా వస్తోంది. ఎంకరేజ్ చేయాలన్నది నా అభిప్రాయం. కాకపోతే.. సినీ రంగంలో కొనసాగడం టఫ్ లైఫ్ అని తెలియజేస్తాం. ఇక్కడ సవాలక్ష రాజకీయాలుంటాయి. అయినా ఈ రంగానే ఎంచుకోదలుచుకున్నపుడు కాదనడానికి మనమెవరం? మంచు లక్ష్మి, సుప్రియ లాంటి వాళ్లు పేరున్న కుటుంబాల నుంచే వచ్చారు కదా. తప్పేముంది?’’ అని చరణ్ అన్నాడు.

పర్సనల్ గా తరచూ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో వివాదాలు, బయటి గొడవల్లో చిక్కుకోవడం గురించి చరణ్ స్పందిస్తూ.. ‘‘చాలాసార్లు నా ప్రమేయం లేకుండానే వివాదాల్లో చిక్కుకున్నా. నాకు సంబంధం లేని వివాదాల్లోకి నన్ను లాగాలని ఏదో ఒకటి అంటుంటారు. ఈ మధ్య రుద్రమదేవి, బ్రూస్ లీ సినిమాల రిలీజ్ వ్యవహారం అందుకో ఉదాహరణ. ఈ విషయంలో మా తప్పేం ఉంది చెప్పండి. అయినా వివాదం చేశారు. ఇంతకుముందు ఇలాంటి వాటికి అగ్రెసివ్ గా రియాక్టయ్యేవాణ్ని. కానీ ఇజప్పుడు మారాను. కొన్నిసార్లు ఇలాంటి వాటి గురించి రియాక్టవడం వల్ల మన స్థాయిని మనమే తగ్గించుకోవడం ఎందుకు అనుకుంటాను. కానీ మాటలు మరీ శ్రుతి మించినపుడు మాత్రం రియాక్టవ్వాల్సిందే’’ అన్నాడు.
Tags:    

Similar News