'చెర్రీ.. బన్నీ' ఇద్దరూ ఇద్దరే

Update: 2019-04-08 04:15 GMT
జనసేన తరపున రామ్ చరణ్ ప్రచారం చేయనున్నాడని గత రెండు రోజులుగా ప్రచారం జరిగింది. అనకాపల్లి బహిరంగ సభలో చరణ్ పాల్గొంటారని కూడా వార్తలొచ్చాయి. అయితే విజయవాడలోని బాబాయిని పరామర్శించడానికి మాత్రమే చరణ్ పరిమితమయ్యారు. గత కొన్ని రోజులుగా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కొంత అస్వస్థకు లోనయ్యారు. దాంతో బాబాయిని పరామర్శించేందుకు చరణ్ విజయవాడ వెళ్లారు.

వ్యాయామం చేస్తూ గాయ పడిన చరణ్ సైతం ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. చరణ్ షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితి ఉండడంతో 'ట్రిపులార్' షూటింగ్ వాయిదా పడడం తెలిసిందే.

కాగా బాబాయి పిలుపు ఇవ్వాలె కానీ.. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధమని అప్పట్లో ప్రకటించిన రామ్ చరణ్.. తన బాబాయి ఎన్నికల్లో గెలుపు కోసం చెమటోడ్చుతున్నా.. పట్టించుకోకుండా ఉండడం.. పరామర్శకు మాత్రమే పరిమితమవ్వడం చర్చనీయాంశం అవుతోంది. అల్లు అర్జున్ కి కూడా ఇది వర్తిస్తుంది.

శ్రీ రెడ్డి ఉదంతంలో పవన్ కళ్యాణ్ ని గట్టిగా హగ్ చేసుకొని.. అప్పటికి పవన్ ఫ్యాన్స్ తో ఉన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి..  పవన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించిన బన్నీ.. మొన్న సింఫుల్  గా జనసేనకు మద్దతు ప్రకటిస్తూ ఒక లెటర్ రాసి ఊరుకోవడాన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ తప్పు పడుతున్నారు. పవన్ తరువాత ఆ రేంజ్ లో జనాల్లో ఫాలోయింగ్ కలిగిన చరణ్ - అర్జున్ ఇద్దరూ ప్రచారానికి దూరంగా ఉండడాన్ని మెగా ఫాన్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది!!



Tags:    

Similar News