తొలిసారి రంగస్థలంలో జట్టు కట్టారు రామ్ చరణ్-సమంత. ఇద్దరూ స్టార్ హీరోహీరోయిన్లే అయినా... ఇంతవరకు వారిద్దరూ కలిసి వెండితెరపై కనిపించింది లేదు. వీరిద్దరి కాంబినేషన్ కూడా రంగస్థలంపై అంచనాలు పెంచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఫోటోలు పాటలు చూస్తుంటే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదినట్టే కనిపిస్తోంది.
1980లనాటి పల్లె పడుచుల అందం రామలక్ష్మి. ఆమెను ఆరాధించే ప్రేమికులు చిట్టిబాబు. ఆ రెండు పాత్రలలో ఒద్దికగా ఒదిగిపోయినట్లు కనిపించారు సామ్-చెర్రీలు. డ్యాన్సుల్లో కూడా వీరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. రంగమ్మ మంగమ్మ పాటలో వీరి హావభావాలు... ప్రేక్షకులను కట్టిపడేశాయి. తొలిసారి జత కట్టినప్పటికీ ఇప్పటికే బోలెడు సినిమాలు చేసిన అనుభవాన్ని రంగస్థలంలో ప్రదర్శించారు వీరిద్దరూ. మూగ చిట్టిబాబు తగిన హీరోయిన్‌గా కనిపించింది రామలక్ష్మి. గతంలో సమంత - చెర్రీ కాంబినేషన్‌లో పలు సినిమాలు చర్చల దాకా వచ్చి ఆగిపోయాయి.
ధ్రువ సినిమాలో కూడా మొదట హీరోయిన్ ఛాన్సు సమంతకే వచ్చిందట. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల రకుల్ ని తీసుకున్నారు. అంతకుముందు బ్రూస్ లీ.. ఎవడు సినిమా కోసం కూడా మొదట సమంతను అనుకున్నారట. అప్పుడు సమంత చాలా బిజీగా మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయి ఉండడంతో వేరే నాయికలను తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఇన్నాళ్లకు సమంత- రామ్ చరణ్ ను తెరపై ఒకే సినిమాలో చూసే అవకాశం వచ్చింది.
రంగస్థలం పాటలు కూడా సూపర్ హిట్ కొట్టాయి. దీనిపై రామ్ చరణ్ కూడా ట్విట్టర్ లో స్పందించాడు. పాటలోని ఒక సీన్ పోస్టర్ ట్వీట్ చేసి...తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ఆడియోను ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్సని చెప్పాడు. అభిమానులనందరినీ మార్చి 18న కలుసుకుంటానని ట్వీటు చేశాడు. ఆ రోజున ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ వైజాగ్ లో ఏర్పాటు చేసింది.