చిన్న సినిమాలకి శాటిలైట్ మార్కెట్ లేదు కానీ... స్టార్ హీరోల సినిమాలు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. టీవీ ఛానెళ్లు పోటాపోటీగా ఆ హక్కుల్ని సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటాయి. తాజాగా రామ్ చరణ్ సినిమా భారీ ధరకు అమ్ముడుపోయింది. జీ నెట్ వర్క్ కంపెనీ 13.3కోట్లకు తెలుగు, హిందీ డబ్బింగ్ వర్షన్ హక్కుల్ని సొంతం చేసుకొంది. రామ్ చరణ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మై నేమ్ ఈజ్ రాజు అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడంతో బిజినెస్ మొదలైంది.
ఇప్పటికే ఏరియాల వారీగా సినిమాకి బిజినెస్ జరుగుతోంది. ఇప్పుడు శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుపోయాయి. 13.3కోట్లు అంటే చరణ్ సినిమాల్లో ఇదొక కొత్త రికార్డు అని చెప్పొచ్చు. `జంజీర్`తో చరణ్ హిందీలోనూ పరిచయం కావడంతో తాజా చిత్రానికి హిందీ నుంచి కూడా శాటిలైట్ ఆఫర్లు వచ్చాయి. డబ్‌డ్ వర్షన్ హక్కుల కోసం పోటీపడ్డారు. అయితే జీ ఛానల్ తెలుగుతో పాటు హిందీ హక్కుల్ని కలిపి కొనేసింది. ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. దసరాని పురస్కరించుకొని చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.