కొల్లేటిలో చెర్రీ అండ్ వైఫ్ చక్కర్లు

Update: 2017-04-18 16:37 GMT
రామ్ చరణ్ ఇప్పుడు గోదావరి జిల్లాలో గోదారి తీరాన సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట తూగో జిల్లాలోని కొన్ని లొకేషన్స్ అనుకుని.. ఆ తర్వాత తమిళనాడు- కేరళల్లో వెతికి.. చివరకు రాజమండ్రి దగ్గరలో సెటిల్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఇక్కడే జరగనుందని అంటున్నారు.

హైద్రాబాద్ లోని స్టూడియోల్లో కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే చేస్తారట. ఇదిలా ఉంటే.. మెగా పవర్ స్టార్ మాత్రం గోదారి జిల్లాల అందాలను తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు. రీసెంట్ గా వీకెండ్ అంతా హైద్రాబాద్ లో వైఫ్ ఉపాసనతో టైం గడిపిన చెర్రీ.. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ స్పాట్ లో జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు చెర్రీకి తోడుగా గోదావరి జిల్లాకి వచ్చేసింది మెగాపవర్ స్టార్ వైఫ్. ఇద్దరూ కలిసి కొల్లేటి అందాల మధ్య చక్కర్లు కూడా కొట్టేస్తున్నారు. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన కొణిదెల.

"కొల్లేరు అందం.. ఆతిధ్యం చూసి ముగ్ధురాలినయిపోయాను. ఇక్కడి చేపల పెంపకం అద్భుతం" అంటూ కామెంట్ చేసింది చెర్రీ వైఫ్. గోదావరి తీరాన షూటింగ్ సంగతేమో కానీ.. ఆ జిల్లాల అందాల మధ్య చక్కర్లు కొట్టే అద్భుతమైన అవకాశం మాత్రం వీరికి దక్కేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News