ప్రేమికుల రోజును ఒక్కొక్కరూ ఒక్కోలా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రేయసీ ప్రియులు ప్రేమ కానుకల్ని ఇచ్చిపుచ్చుకోవడమే కాదు.. కొత్త గోల్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. స్టార్ కపుల్స్ లో ప్రేమికుల రోజు ఎలా గడిచింది? అంటే ఈరోజును మన స్టార్లు చాలా సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకున్నారని అర్థమవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ - ఉపాసన జంట ప్రేమికుల దినోత్సవాన్ని ఎలా స్పెండ్ చేశారు? అంటే..
వాలంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ట్విట్టర్ పోస్టులు ఆసక్తి రేకెత్తించాయి. చరణ్ పెళ్లి తర్వాత ఉపాసనకు ఎన్నో కానుకలు అందించారు. వాటన్నిటిని మించిన ఓ విలువైన మాటను చెప్పారు. `ప్రేమలో పడొద్దు.. ప్రేమతో ఎదుగు!` అని చెర్రీ చెప్పిన ఓ మాటను ఉపాసన గుర్తు చేయడం విశేషం. ఈరోజు బ్రేక్ ఫాస్ట్ వెరీ స్పెషల్.. అని ఉపాసన ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక జీవిత భాగస్వామితో కలిసి రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటామని ఉపాసన వెల్లడించారు.
చెర్రీ- ఉపాసన బంధంపై ఓ మ్యాగజైన్ లో వచ్చిన కవర్ పేజీ ఆర్టికల్‌ను ఉపాసన అభిమానులకు షేర్ చేశారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. మిస్టర్ సి మాటల్లో చెప్పాలంటే... `ప్రేమలో పడొద్దు.. ప్రేమతో ఎదుగు` అని అంటారని ఉపాసన చేసిన ట్వీట్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2020లో రిలీజ్ కానుంది. ఉపాసన రెగ్యులర్ గా బీపాజిటివ్ మ్యాగజైన్ సహా ఎన్నో వ్యాపకాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వన్యప్రాణి సంరక్షణ .. పెద్ద పులుల సంరక్షణ గురించి ఓ ఆసక్తికర వీడియోని అభిమానులకు షేర్ చేసిన సంగతి తెలిసిందే.