మెగా ఫ్యామిలీలో విబేధాలు.. ముఖ్యంగా పవన్- చిరు.. పవన్- చెర్రీల మధ్య పొసగడం లేదు లాంటి వార్తలు చాలానే వినిపిస్తాయి. ఖైదీ నంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని.. అబ్బాయ్ రామ్ చరణ్ అలిగాడని కూడా అంటారు. ఇలాంటివన్నీ రూమర్స్ అని ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ కొత్తగా ఇంకోటి పుడుతూనే ఉంటుంది.
ప్రస్తుతం గోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుతున్న రామ్ చరణ్.. అభిమానులతో రోజూ ముచ్చటిస్తున్నాడు. ఓ సందర్భంలో నేరుగా కాకపోయినా రాజకీయాలపై కూడా మాట్లాడేశాడు. 'మీరందరూ బాబాయ్ కి అండగా ఉండండి. రాజకీయం అయినా.. మరెందులో అయినా.. మీ అందరి మద్దతు బాబాయ్ కి ఉండాలి' అంటూ చెర్రీ చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. అందరినీ అలర్ట్ చేశాయి. ఇప్పటివరకూ రాజకీయంగా అయితే తండ్రి చిరంజీవికే రామ్ చరణ్ సపోర్ట్ ఉంటుందని అంతా భావించారు. కాంగ్రెస్ లో ఉన్న చిరుకు చెర్రీ మద్దతు ఎక్స్ పెక్ట్ చేశారు.
కానీ రామ్ చరణ్ మాత్రం అభిమానులను బాబాయ్ కే మద్దతు ఉండాలని కోరాడు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కూడా పవన్ కి ఓపెన్ గానే మద్దతు పలికాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా తోడవడంతో.. రాజకీయంగా ఆయనకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉందనే విషయం అర్ధమైపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/