గ్లోబల్ బ్లాక్ బస్టర్ `ఆర్ ఆర్ ఆర్` 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం (ఇంగ్లీష్ యేతర) మరియు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగం సహా పలు కేటగిరిలో అనేక చిత్రాలతో పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ లాస్ ఏంజెల్స్‌కు వెళ్తున్నారు.
భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం జనవరి 11- 2023న జరగనున్న వేడుకలో మరింత మంది పాల్గొనే అవకాశం ఉంది. అలాగే జనవరి 9 న ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ (TCL చైనీస్ థియేటర్స్)లోనూ `ఆర్ ఆర్ ఆర్` స్పెషల్ స్క్రీనింగ్ అవుతుంది. ఈ షోకి కూడా రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతారని సమాచారం. వాళ్లతో పాటు దర్శకుడు రాజమౌళి..సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కూడా అటెండ్ అవుతారని తెలుస్తోంది.
దీంతో `ఆర్ ఆర్ ఆర్` నామినేషన్స్ ముందు సినిమా పేరు అన్ని రకాలుగా మారు మ్రోగుతోంది. ఓ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అవ్వడం ఇదే తొలిసారి. దీనికి కారకులు రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా సినిమా ఫోకస్ అవుతుందంటే కర్త..కర్మ..క్రియ అన్ని ఆయనే. వ్యక్తగతంగా కోట్ల రూపాయలు `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్ కోసం ఖర్చు చేస్తున్నారు.
ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతోందని దేశం మొత్త ఎంతో నమ్మకంతో ఉంది. ఇండియాకి ఆస్కార్ అవార్డుతోనే తిరిగి రావాలని ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ రేసులో ఉంది. సినిమాలోని `నాటు నాటు` ట్రాక్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.