కెరీర్ లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించి మెప్పించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతోనే మెగా వారసుడిగా తనదైన మార్క్ చూపించడంలో సక్సెసయ్యాడు. మాస్ లో మాసివ్ స్టార్ గా తనని తాను నిరూపించుకునే సత్తా ఉందని రామ్ చరణ్ నిరూపించారు. నటించిన రెండో సినిమా `మగధీర` టాలీవుడ్ బెస్ట్ గా నిలవడమే గాక జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో చర్చల్లో నిలిచింది. టాలీవుడ్ టాప్ 20 సినిమాల జాబితాలో రికార్డుల పరంగా ఎప్పటికీ మగధీర నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఆ తర్వాతా చరణ్ ఎంచుకున్న మార్గం ఏమిటో అందరికీ తెలిసిందే. వరుసగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల్లో నటించి విజయాలు అందుకున్నాడు. రచ్చ - నాయక్ - ఎవడు వంటి పక్కా మాస్ చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా చూసుకున్నాడు. అయితే చరణ్ లో ప్రయోగాత్మకతకు ఆస్కారం లేదా? అనుకుంటున్న టైమ్ లో ధృవ లాంటి భారీ ప్రయోగంతో మరోసారి మైమరిపించాడు. ఆ వెంటనే `రంగస్థలం` లాంటి మరో ప్రయోగం. ఈసారి ఏకంగా ఇండస్ట్రీ రికార్డుల్నే తిరగరాశాడు. రంగస్థలం చిట్టిబాబుగా చెర్రీని తెలుగు జనం ప్రేమించారు. గౌరవించారు. రొటీన్ మాస్ సినిమాల హీరోనే అని తెగిడిన వాళ్లే .. గొప్ప నటుడు అని చరణ్ ని కీర్తించారు. కెరీర్ పరంగా ప్రయోగాలు చేయలేక కాదు.. నిర్మాత సేఫ్టీ ముఖ్యం! అని పదే పదే ఆలోచించే హీరోని అని చరణ్ ప్రతిసారీ చెబుతుంటారు. అందుకే మెగా స్టార్ లా కెరీర్ ఆరంభమే ప్రయోగాలు చేయాలన్న ఆలోచనా చేయలేదు. తనని నమ్మే దర్శకనిర్మాతల హీరోగా నిరూపించుకునేందుకు ప్రయత్నించారు.
మునుముందు చరణ్ ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయబోతున్నారు. సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఆ సంగతి స్పష్టంగా అర్థమవుతోంది. ఇక తన కెరీర్ బెస్ట్ సినిమాని ఇచ్చిన జక్కన్న దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో విలక్షణమైనది. స్వాతంత్య్ర సమరయోధుడు.. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అభినయించనున్నారు. అయితే అల్లూరి వీరుడు కాకముందు ఎలా ఉండేవాడు? అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నామని - వీరుడు అవ్వడానికి దారి తీసిన కారణాల్ని చూపిస్తున్నామని రాజమౌళి చెప్పకనే చెప్పారు. మీరు తెరపై చూసిన.. మీకు బాగా తెలిసిన సీతారామరాజు కానేకాదు. పూర్తిగా ఫిక్షనల్ సీతారామరాజును చూస్తారు! అని ట్విస్టిచ్చారు కాబట్టి కచ్ఛితంగా చరణ్ ని పూర్తిగా కొత్త యాంగిల్ లో చూపిస్తున్నారని అర్థమవుతోంది. చరణ్ కి పెయిర్ గా ఆలియా భట్ లాంటి టాప్ స్టార్ నటిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా రొమాన్స్ - కెమిస్ట్రీ పైనా మెగా ఫ్యాన్స్ ఎక్కువగానే ఊహించుకుంటున్నారు. భారత దేశ నంబర్ వన్ దర్శకుడి నిర్ధేశనంలో చరణ్ కెరీర్ బెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ ఇండియా లెవల్లో రికార్డులు తిరగరాయడం .. సంచలనాలు సృష్టించడం ఖాయం అన్న చర్చ సాగుతోంది. అయితే నేడు చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి ఇంకేదైనా గ్లింప్స్ ను అభిమానుల ముందుకు తెస్తారని ఆశించారు. కానీ ఇంతవరకూ అలాంటిదేం లేదు. ఆర్.ఆర్.ఆర్ నిర్మాణ సంస్థ సింపుల్ గా చరణ్ కి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పి సరిపుచ్చింది. ఇది చెర్రీ అభిమానులకు కాస్తంత నిరాశే అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేష మెగాభిమానుల తరపున, `తుపాకి` తరపున హ్యాపి బర్త్ డే టు యు మెగా పవర్ స్టార్.