అన్ని పేర్లూ వదిలేసి బ్రూస్‌ లీ ఎందుకో?

Update: 2015-08-28 16:27 GMT
ఎట్టకేలకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమాకు 'బ్రూస్‌ లీ' అనే టైటిల్‌ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌ ను స్వయంగా డైరక్టర్‌ శ్రీను వైట్ల తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా ఊరంతా ప్రకటించేశారు. ఇకపోతే ఈ టైటిల్‌ అనుకోక ముందే మెరుపు, విజేత వంటి పేర్లను పరిశీలించినట్లు ఎన్నో వార్తలొచ్చాయి. కాని అవేవీ కాదని ఈ టైటిల్‌ కే ఎందుకు ఓటేశారు? కేవలం హీరో పేరు బ్రూస్‌ లీ కాబట్టే ఇలా చేశారా? ఇంకేమైనా రీజన్లు ఉన్నాయా?

నిజానికి చరణ్‌ వంటి పెద్ద స్టార్ల సినిమాలకు ఎలాంటి టైటిల్‌ పెట్టినా కూడా సెట్టయిపోతుంది. ఈ మధ్యనే ఇదే విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ అత్తరాంటికి దారేది వంటి టైటిళ్ళు ప్రూవ్‌ చేశాయి. అయితే ఈ సినిమాలే కాకుండా ఇప్పుడు పెద్ద హీరోలందరూ డిఫరెంట్‌ పేర్లనే కోరుకుంటున్నారు. ఇకపోతే చరణ్‌ విషయానికొస్తే.. చిరుత - రచ్చ - నాయక్‌ - ఎవడు.. వంటి హీరోయిజమ్‌ రిలేటడ్‌ టైటిళ్ళతో వచ్చాక ఇక ఇప్పుడైన హీరో పేరుతో రావాలని అనుకున్నాడేమో. అందుకే బ్రూస్‌ లీ అనే పేరునే ఫిక్సుచేసుకునుంటాడు. అయితే అసలు బ్రూస్‌ లీ అనే పేరుకంటే పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ నేమ్‌ ఏముంటుందిలే.. ఆ పేరు చెబితేనే కరాటే నుండి కుంగ్‌ ఫూ వరకు ఉన్న మార్షల్‌ ఆర్ట్స్‌ అన్నీ వణికిపోవూ.. అందుకే అన్ని పేర్లూ వదిలేసి ఆ పేరును పెట్టుకొని ఉంటాడు ఈ మెగా హీరో.

ఇకపోతే ఈ టైటిల్‌ కు ఇప్పుడు విపరీతమైన క్రేజ్‌ వచ్చేస్తోంది. మెరుపు, విజేత కంటే బ్రూస్‌ లీ బాగానే ఉందంటూ మెగా ఫ్యాన్సు కూడా హల్‌ చల్‌ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ టైటిల్‌ ట్రెండ్‌ అవ్వడం మొదలైందండోయ్‌. ఇంతకీ టైటిల్‌ తో కూడిన ట్రైలర్‌ ను ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నారో మరి...
Tags:    

Similar News