అటు ఇటుగా ఇంకో 20 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది ‘బ్రూస్ లీ’ సినిమా విడుదలకు. ఇంకా షూటింగ్ పూర్తయినట్లయితే సమాచారం లేదు. అసలు చిరు పోర్షన్ కు సంబంధించిన స్టేటస్ ఏంటో తెలియట్లేదు. రామ్ చరణ్ కి కానీ, శ్రీను వైట్లకు కానీ ఏమాత్రం టెన్షన్ ఉన్నట్లయితే కనిపించలేదు. చరణేమో ‘కంచె’ ఆడియోలో సందడి చేసి వెళ్లాడు. శ్రీను వైట్ల తాపీగా ‘బ్రూస్ లీ’ ప్రెస్ మీట్ పెట్టాడు. సినిమా పూర్తయ్యాక ఎంత రిలాక్స్డ్ గా ఉంటారో.. అలాగే కనిపిస్తున్నారిద్దరూ. కానీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారమైతే ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇవిగో కొత్త పోస్టర్లు.. అదిగో సాంగ్ టీజర్.. ఆడియో రీసౌండ్స్ ఆన్ అక్టోబర్ సెకండ్.. అంటూ ‘బ్రూస్ లీ’ ప్రకటనల హడావుడైతే బాగానే ఉంది.
చిరుది ఇలా మెరిసి అలా మాయమయ్యే పాత్రయితే ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆయనకు పాట - ఫైటు - కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి వాటి స్టేటస్ ఏంటో తెలియట్లేదు. అన్నిటికీ మించి చిరు - చరణ్ కలిసి స్టెప్పులేసే పాట గురించి అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఈ పాటకు ముందు ఇలియానా అన్నారు.. తర్వాత తమన్నా పేరు వినిపించింది. ఐతే ఆ ఇద్దరూ కాదని తేలిపోయింది. మరి ఎవరైనా రొటీన్ ఐటెం భామని పెట్టి లాగించేస్తున్నారో ఏమిటో. ఈ హడావుడిలో స్టెప్పులు కూడా మామూలుగా ఉంటే అభిమానులు డిజప్పాయింట్ అయిపోతారు. చాలా చాలా స్పెషల్ గా ఉంటేనే ఆ పాట కిక్కిస్తుంది. మరి శ్రీను వైట్ల అండ్ టీమ్ ఏం చేస్తోందో?