ప్చ్‌.. నెల రోజుల్లో 20శాతం చెయ్యాలి

Update: 2015-09-01 17:52 GMT
చరణ్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌ తో కనిపిస్తున్నాడు. ఈసారి అతడి రేంజ్‌ 100కోట్లను తాకేట్టే కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన బ్రూస్ లీ టీజర్‌ మైండ్‌ బ్లోవింగ్‌ అంటూ టాక్‌ తెచ్చుకుంది. హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమా లెవల్ లో విజువల్స్‌ తో శ్రీనువైట్ల కట్టిపడేశాడు. అసలు ఆ ట్రైలర్‌ కట్‌ చేసిన తీరు చూస్తుంటే యమహో యమ: అనాలనిపిస్తోంది.

ఒక స్టంట్‌ మన్‌ క్యారెక్టర్‌ లో చరణ్‌ అసాధారణ పోరాటాలు చేస్తాడని చెబుతున్నారు. అందుకే సింబాలిక్‌ గా బ్రూస్ లీ అన్న టైటిల్‌ నిర్ణయించామని అన్నారు. ఇప్పటికే 80శాతం షూటింగ్‌ పూర్తి చేశారు. 20శాతం బ్యాలెన్స్‌ మిగిలిపోయింది. అయితే బ్యాలెన్స్‌ షూట్‌ కి డెడ్‌ లైన్‌ సరిగ్గా నెలరోజులు. ఈలోగా పూర్తి చేసి రిలీజ్‌ చేయాల్సిన సన్నివేశం ముందుంది. అక్టోబర్‌ లో దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు కాబట్టి డెడ్‌ లైన్‌ మీటవ్వాల్సిందే.

అయితే క్లయిమాక్స్‌ ఆల్రెడీ బ్యాంకాక్‌ లో తీసేశారు కాబట్టి, తీయాల్సినవి కామెడీ సీన్ లు, కొన్ని రొమాంటిక్‌ పాటలు మాత్రమే. కాని శ్రీను వైట్ల సినిమాల్లో అవే ప్లస్ కాబట్టి, వాటిని ఎలా పడితే అలా తీస్తే కష్టమే. ఆదరా బాదరాగా చుట్టేస్తే క్లయిమాక్స్‌ అనుకున్నంత క్వాలిటీతో వస్తుందా? తీరిగ్గా సమయం తీసుకుని చేయాల్సిన పార్ట్‌ కదా! తేడాలొస్తే అంతే సంగతి. ఇలా త్వరత్వరగా  తీసేస్తే గతంలో కొన్ని చరణ్‌ సినిమాలు ఎలా తేలిపోయాయో తెలిసిందే.
Tags:    

Similar News