బ్రూస్ లీ ది ఫైటర్ ట్రైలర్ అక్టోబర్ 2న రిలీజ్ అయింది. నవరసాలను పక్కాగా మిక్స్ చేసి, రూపొందించిన ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ నే, ప్రేక్షకులందరినీ బాగానే ఆకట్టుకుంది. రామ్ చరణ్ యాక్షన్, కళ్లు తిప్పుకోనివ్వని స్టెప్స్ ప్రధాన ఆకర్షణ కాగా.. ట్రైలర్ మొత్తం పక్కాగా శ్రీను వైట్ల స్టైల్లో కనిపిస్తుంది. రకుల్ ప్రీత్ గ్లామర్ వ్యూయర్స్ కి బోనస్.
ఇన్ని అట్రాక్షన్స్ ఉన్న బ్రూస్ లీ ట్రైలర్.. రికార్డ్ వ్యూస్ తో అదరగొడుతోంది. యూట్యూబ్ లో బ్రూస్ లీ ట్రైలర్ కి కేవలం నాలుగు రోజుల్లోనే 10లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా రికార్డే కానీ.. అక్టోబర్ 16 వస్తున్న బ్రూస్ లీ మూవీ ఇంతకంటే పెద్ద రికార్డులు సృష్టించాలని మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. హైప్ పెరగకుండా ఉండేందుకు. డీటైల్స్ పూర్తిగా చెప్పకుండా.. యూనిట్ బాగానే మెయింటెన్ చెప్పారు ఇన్నాళ్లు. కానీ ఆడియో ఫంక్షన్ తర్వాత ఒక్కసారిగా ఫీల్ మారిపోయింది.
స్వయంగా మెగాస్టారే ఫుల్ మీల్స్ అంటూ.. ఆకాశానికి ఎత్తేయడంతో ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. దీన్ని అందుకునేందుకు చరణ్, శ్రీనువైట్ల గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చేస్తుందని చెబ్తున్నారు. ఇది రాగానే బ్రూస్ లీని.. సెన్సార్ కి పంపిస్తారట. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన మూడోరోజుకు ఫస్ట్ కాపీ చేతికి రావడమంటే... ఇది కూడా ఓ రికార్డే అవుతుంది.