ప్రేమలీలలు పూర్తి చేసిన చరణ్

Update: 2015-10-29 05:53 GMT
ప్రేమపావురాలు - ప్రేమాలయం లాంటి చిత్రాలను చేసిన కాంబినేషన్ సల్మాన్ ఖాన్ - సూరజ్ ఆర్ బరజాత్యా. ఇప్పుడు ప్రేమ లీల అనే పేరుతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి ప్రేమ లీల అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో సల్మాన్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

తన రోల్ కి తెలుగులో వాయిస్ ఇవ్వాలంటూ బాలీవుడ్ కండలవీరుడు అడగ్గానే.. చెర్రీ ఓకే చెప్పేశాడు. రీసెంట్ చెర్రీ తన వెర్షన్ కి డబ్బింగ్ చెప్పేశాడు కూడా. ఇలా ఒక హీరోకి వాయిస్ ఇవ్వడం రామ్ చరణ్ కెరీర్ లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇప్పటివరకూ ఏ మూవీకి వాయిస్ ఓవర్ కూడా చెప్పని చెర్రీ.. తొలిసారిగా ఇలా  డబ్బింగ్ చెప్పడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది.

ప్రేమలీల నవంబర్ 12న.. హిందీ వెర్షన్  రిలీజ్ రోజునే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళిని మెగా ఫ్యాన్స్ చెర్రీ వాయిస్ తో పండగ  చేసేసుకోవచ్చు. సల్మాన్ కి జంటగా సోనమ్ కపూర్ నటించిన ఈ మూవీపై.. అంచనాలు చాలానే ఉన్నాయి.
Tags:    

Similar News