నిజంగా చరణ్ వినయ విధేయుడే!

Update: 2018-11-22 01:30 GMT
ఇదేదో సినిమా టైటిల్ ని బట్టి చెబుతున్న మాట కాదు. మెగా పవర్ స్టార్ ని దగ్గరుండి చూసి కలిసిన వాళ్ళు చెబుతున్న వ్యక్తిగత అభిప్రాయం. ఎవరైనా దగ్గరికి వస్తే దైవాంశసంభూతుల్లా ఫీలయ్యే కొందరు హీరోలున్న ట్రెండ్ లో  అంత మెగాస్టార్ వారసుడు తనకంటూ కోట్లాది అభిమానులను సంపాదించుకున్న చరణ్ గురించి ఎవరైనా ఏవేవో ఊహించుకోవడం సహజం. కానీ చరణ్ ను కలిసిన ఎవరైనా సరే ఆ కొద్దీ క్షణాలు లేదా నిమిషాలు ఆ పరిచయాన్ని మర్చిపోవడం అసాధ్యం.

కారణం అతని డౌన్ టు ఎర్త్ యాటిట్యూడే. గోదావరి జిల్లాల్లో రంగస్థలం షూటింగ్ జరిగినప్పుడు లక్షలాది జనం స్పాట్ దగ్గ పోగయ్యేవారు. నిజానికి ఆ తాకిడి తట్టుకోలేకే సుకుమార్ హైదరాబాద్ వచ్చి సెట్ వేసుకుని మరీ సినిమా తీసుకున్నాడు. కానీ గోదావరి చుట్టుపక్కల నుంచి ఎందరు అభిమానులు వచ్చినా విసుక్కోకుండా వందలాది ఫోటోలు దిగడం అక్కడున్న వారు ప్రత్యక్షంగా చూసిందే.

అందుకే చరణ్ దాకా వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకుంటే అక్కడికి వెళ్ళాక ఊహించని మర్యాదతో ఆతిధ్యంతో ఉక్కిరిబిక్కిరి అవ్వొచ్చట. నాన్న లాగే ఎంతమంది వచ్చినా చిరునవ్వుతో స్వీకరించే సుగుణాన్ని చూసి ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పుకోవడం గమనార్హం.

ఇదంతా పొగడ్తలా అనిపించినా ఇది  చరణ్ ను కలిసిన వారి మాటే తప్ప ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. వినయ విధేయ రామ విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకా డేట్ అనౌన్స్ చేయనప్పటికీ జనవరి 11న వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఒక్కపాట మాత్రమే బాలన్స్ ఉన్న వినయ విధేయ రామకు ఆర్ఆర్ఆర్ కోసం చరణ్ చిన్న బ్రేక్ ఇచ్చాడు. వచ్చే నెల మొదటి వారంలో అది పూర్తి చేసి పూర్తిగా రాజమౌళి అడ్డాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాత్రం ఏడాదిపైగా ఎదురు చూపులు తప్పవు.


Tags:    

Similar News