మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య`లో స్పెషల్ రోల్ లో ఎవరు నటిస్తున్నారు? అంటే ఇన్నాళ్లు డైలమా కొనసాగింది. ఈ పాత్ర కోసం మహేష్ ని సంప్రదించినా కుదరలేదు. చివరికి రామ్ చరణ్ నటిస్తే బావుంటుందని కొరటాల- చిరు ఒప్పించారు. ఎట్టకేలకు అధికారికంగా చరణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తానికి మెగాభిమానులకు ఇది తీపి కబురులాంటిదే.
చరణ్ మాట్లాడుతూ-`` 2015లో నేను నటించిన బ్రూస్ లీ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. ఖైదీ నెంబర్ 150లో నేను నాన్నతో కలిసి డాన్స్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఆచార్యలో కలిసి నటిస్తున్నాం. నేను నాన్న కలిసి తెరపై పూర్తి స్థాయిలో కనిపించాలని మా అమ్మ కల. మరోసారి మా కాంబినేషన్ అలరిస్తుందని నమ్ముతున్నాను`` అని చరణ్ తెలిపారు.
చిరంజీవి - చరణ్ మల్టీస్టారర్ ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్- కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ ఇందులో కథానాయక. చిరు బర్త్ డే కి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చక్కని స్పందన వచ్చింది. ఇటీవల గుండు లుక్ తో మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇది చిరు నటించే వేరొక చిత్రానికి సంబంధించిన ఒక గెటప్ ట్రయల్ అని తెలుస్తోంది. ఆచార్య 2021 సమ్మర్ కి వచ్చేస్తే.. అదే ఏడాదిలో చరణ్ నటించే ఆర్.ఆర్.ఆర్ కూడా రిలీజవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మహమ్మారీ శాంతించకపోయినా జాగ్రత్తలు పాటిస్తూ ఆచార్య పట్టాలెక్కేయడం ఖాయంగా కనిపిస్తోంది.