హిట్లర్ తో కాఫీ తాగాలంటున్న చెర్రీ

Update: 2016-12-07 17:30 GMT
అసలు హిస్టరీలోకి వెళ్ళి ఎవరితైనా ఒక సిట్టింగ్ వేయాలంటే.. ఎవరైనా ఎవరి పేరు చెబుతారు? కొందరైతే మహాత్మ గాంధికి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలని.. కొందరైతే మర్లిన్ మన్రోతో ఒక సెల్ఫీ దిగాలని కోరుకుంటారు. కాని మెగా పవర్ స్టార్ మాత్రం.. తన రూటే సెపరేటు అంటున్నాడు.

''నేను హిస్టరీలోకి వెళ్లే సౌలభ్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్లర్ ను కలవాలని అనుకుంటున్నా. అతనితో కూర్చొని టి తాగి.. అతను అసలు అంత చీప్ గా ఎలా ఆలోచించాడో తెలుసుకుంటా. వీలైతే అతని బుర్రలోకి దూరి.. అసలు ఆమానుషమైన ఆలోచనలు ఎలా చేసేవాడో తెలుసుకుంటా'' అంటూ సెలవిచ్చాడు రామ్ చరణ్‌. ఒక అభిమాని చేసిన ఇంటర్యూలో మాట్లాడిన ఈ యంగ్ హీరో.. ఇంకా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడులే. తను ఎప్పుడూ ఉపాసనకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వనని.. కేవలం కాఫీ మగ్గులు వంటివే ఇస్తానని.. ఖరీదైన గిఫ్టుల మీద ఇద్దరికీ పెద్దగా మక్కువ లేదని సెలవిచ్చాడు.

ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖాళీ సమయం దొరికితే మాత్రం.. యురోప్ వెళ్ళి అక్కడ స్కీయింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడట. తన భార్యతో కలసి మంచు కొండల్లో స్కీయింగ్ చేయాలనేది మనోడి కోరిక అని చెప్పుకొచ్చాడు చెర్రి. ముందుగా ధృవ సూపర్ హిట్టవుతుందనే కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచాడులేండి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News