మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకపక్క తన తండ్రి చిరు 150వ సినిమా వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటూనే మరోపక్క తాను నటిస్తున్న, నటించబోయే సినిమాలపై దృష్టిపెడుతున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనే ధృవ సినిమాకోసం ఫిజిక్ మార్చుకున్న చరణ్ సినిమా మొదలైన చాలా రోజులకు షూటింగ్ లో పాల్గుంటున్నాడు.
ఈ సినిమా తమిళనాట భారీ విజయం సాధించడం, తెలుగులో స్క్రిప్ట్ పనులన్నీ పకడ్బందీగా కుదరడంతో కేవలం 45 నుండి 50రోజుల డేట్ల వ్యవధిలో తన పార్ట్ కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం.
చరణ్ కి అచ్చొచ్చిన పండగ సీజన్ సెప్టెంబర్ - అక్టోబర్ లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు యోచనలో వున్నారు. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దీని తరువాత చెర్రీ సుకుమార్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసినదే.