అబ్బాయ్ రామ్ చరణ్, బాబాయ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకేసారి షూటింగులతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. బ్రూస్ లీ, సర్ధార్ గబ్బర్ సింగ్ ఆన్ సెట్స్ ఉన్నాయి. రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ బ్రూస్లీ టీజర్ లు రిలీజయ్యాయి. చిరంజీవి పుట్టిన రోజున ఒక టీజర్, పవన్ కల్యాణ్ పుట్టిన రోజున ఇంకో్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే మొదటి టీజర్ చూడగానే ఇదో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అన్న సిగ్నల్స్ వచ్చింది. ఆ టీజర్ మాస్ కి పిచ్చిగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్ దూరమైపోతారా? అన్న సందేహాలొచ్చాయి.
సరిగ్గా అలాంటి టాక్ నడుస్తున్నప్పుడే పవన్ కల్యాణ్ పుట్టినరోజున బ్రూస్ లీ కొత్త టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ చూశాక అందరికీ అర్థమైంది ఏమంటే ఇది కేవలం యాక్షన్ సినిమానే కాదు, ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమా. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ పక్కాగా జోడించి శ్రీనువైట్ల మరో చక్కని ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు అని అర్థమవుతోంది. దీన్నిబట్టి అబ్బాయ్ చరణ్ ని, బాబాయ్ పవన్ కాపాడినట్టే మరి. ఆరోజు ఆ టీజర్ రాకపోయి ఉంటే ఇప్పటికీ పంపిణీదారులు, బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టేవే. ఇది ఏ జోనర్ సినిమా అన్న కన్ఫ్యూజన్ లో కొట్టుకుపోయేవారంతా.
గోవిందుడు అందరివాడేలే సినిమాతో చరణ్ యాక్షన్ సినిమాలే కాదు, ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేయగలడు అన్న పేరొచ్చింది. ఇప్పుడు బ్రూస్ లీ తోనూ క్లారిటీ గా ఫ్యామిలీ ఆడియెన్ కోసం వస్తున్నాడని అర్థమైంది. కన్ఫ్యూజన్ లో కొట్టుకు పోయేకంటే క్లారిటీతో రేసులోకి వెళ్లడమే కరెక్ట్.