ఇది చాల‌దురా అని హెచ్చ‌రించినందుకే!

Update: 2019-12-18 08:18 GMT
బ‌రువు అదుపు త‌ప్పితే ఆ స‌మ‌స్య‌ ఎలా ఉంటుందో కొంద‌రు హీరోలు.. హీరోయిన్ల‌కు ప్రాక్టిక‌ల్ గానే అర్థ‌మైంది. సైజ్ జీరో స‌మ‌యంలో పెరిగిన‌ వ‌ల్ల అనుష్క ఎంత ఇబ్బందిని ఎదుర్కొంటోందో చూస్తున్న‌దే. అలాగే యువ‌హీరో నారా రోహిత్ కి హెవీ వెయిట్ స‌మ‌స్య‌గా మార‌డంతో ఆ ప్ర‌భావం కెరీర్ పైనా క‌నిపించింది. సాటి హీరోలు ముందుకు దూసుకెళుతుంటే రోహిత్ ఇంకా అదే మూస‌లో ఉండిపోవ‌డం నిరాశ‌ప‌రిచింది.

ఇక‌పోతే మెగా హీరోల్లోనే ఛాలెంజింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి తేజ్.. పేరు నుంచి ధ‌ర‌మ్ ని తొల‌గించినా బ‌రువు మాత్రం త‌గ్గ‌డం లేదు! అంటూ ఇటీవ‌ల నెటిజ‌నుల్లో కామెంట్లు వినిపించాయి. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో ఎంత స్మార్ట్ గా క‌నిపించాడో ఇటీవ‌ల చిత్ర‌ల‌హ‌రిలో అంత ఫ్యాట్ గా బ‌రువు పెరిగి క‌నిపించాడు. రూపం చాలా మారిపోవ‌డం ఫ్యాన్స్ లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది. అయితే ఇప్పుడు ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంలో మాత్రం సాయి తేజ్ పూర్తిగా స్మార్ట్ గా క‌నిపించనున్నాడ‌ట‌. ఇటీవ‌ల రిలీజైన టీజ‌ర్.. ట్రైల‌ర్ లో స్మార్ట్ గానే క‌నిపించాడు.

అయితే ఇంత‌లోనే ఈ మార్పు ఎలా సాధ్య‌మైంది? అంటే దాని వెన‌క మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రోద్బ‌లం ఉంద‌ని సాయి తేజ్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. చిత్ర‌ల‌హ‌రి రిలీజ్ త‌ర్వాత‌ చ‌ర‌ణ్ ని క‌లిశాను.  అప్ప‌టికే కొంత బ‌రువు త‌గ్గాను. కానీ `ఇది చాల‌దురా` అని అన్నాడు చ‌ర‌ణ్. ఆ స‌మ‌యంలోనే చ‌ర‌ణ్ ఫిజిక‌ల్ ట్రైన‌ర్ రాకేష్ ఉడియార్ ని క‌లిశాడ‌ట‌. చెర్రీకి అత‌డి పేరును సూచించింది కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్. చ‌ర‌ణ్ ట్రైన‌ర్ రాకేశ్‌ వ‌ల్ల‌నే తాను కూడా బ‌రువు త‌గ్గాను అని మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ తెలిపాడు. ఇక ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంలో చొక్కా విప్పి ఫైట్ చేసేంత కాన్ఫిడెన్స్ వ‌చ్చింద‌ని.. ద‌ర్శ‌కుడు మారుతి అడిగిన‌ట్టే చొక్కా విప్పి ఫైట్ చేశాన‌ని సాయిధ‌ర‌మ్ తెలిపాడు. ఇటీవ‌లే సాయి తేజ్ మ‌జిల్స్ ప్ర‌ద‌ర్శిస్తున్న పోస్ట‌ర్ ని రివీల్ చేస్తే దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ నెల 20న సాయి తేజ్ న‌టిస్తున్న ప్ర‌తిరోజూ పండ‌గే రిలీజ‌వుతోంది.



Tags:    

Similar News