చెర్రీ ఏంటి బాండ్ - 007 లా స్టైలిష్ గా దిగాడు..!

Update: 2022-09-04 05:34 GMT
లుక్ ని మెయింటెయిన్ చేయ‌డంలో చెర్రీ త‌ర్వాతే. మూవీ షూటింగులు లేన‌ప్పుడు చాలా సింపుల్ గా సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడిలా క‌నిపించే చెర్రీ సెట్స్ పైకి వెళితే మాత్రం త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అల్టిమేట్ లుక్ లోకి షిఫ్ట‌యిపోతుంటాడు. స్వామి అయ్య‌ప్ప మాల‌ను ప్ర‌తియేటా ధ‌రిస్తూ గురు స్వామిగా మారుతున్న చ‌ర‌ణ్ ఇలా సూట్ బూట్ లో అల్ట్రా పోష్ లుక్ లో క‌నిపించ‌డం ఎప్పుడూ అభిమానుల‌కు స‌ర్ ప్రైజింగ్ గానే అనిపిస్తుంది.

ఇంత‌కీ ఇది ఏ మూవీ కోసం ప్రిప‌రేష‌న్ అంటే.. నిస్సందేహంగా శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న తన తదుపరి చిత్రం RC15 షూటింగ్ కి సంబంధించిన‌ది. ఆన్ లొకేష‌న్ స్టిల్ కొంత‌కాలంగా వెబ్ లో వైర‌ల్ గా మారుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చెర్రీ లుక్ చూడ‌గానే అవెంజ‌ర్స్ స్టార్ రేంజులో క‌నిపిస్తున్నాడ‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. కొంద‌రైతే జేమ్స్ బాండ్ 007 హెలీకాఫ్ట‌ర్ నుంచి దిగుతున్న‌ట్టుగా ఉంది! అని కూడా కామెంట్ చేస్తున్నారు. సూటు బూటు ధ‌రించి గుబురు గ‌డ్డంతో కూలింగ్ గ్లాసెస్ ధ‌రించి స్టైలిష్ గా హెలీకాఫ్ట‌ర్ నుంచి దిగుతున్నాడు. త‌న‌ జుట్టుకు బూడిద రంగు గ్లో జోడించడంతో చూడ‌గానే హాలీవుడ్ స్టార్ అన్న‌ అనుభూతి క‌లుగుతోంది.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ చివరిసారిగా రాజమౌళి RRR లో కనిపించాడు. త‌దుప‌రి గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయ‌నున్నాడు. అలాగే కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో సినిమా పైనా క‌న్నేశాడు. ఇంత‌లోనే ధ‌నుష్ త‌ర‌హాలో ఏదైనా హాలీవుడ్ మూవీ చేయాల‌న్న ప్ర‌య‌త్నం చేస్తున్నాడా? అన్న సందిగ్థ‌త అభిమానుల‌కు అలానే ఉంది. ఇటీవ‌ల ఆర్.ఆర్.ఆర్ అటు అమెరికా -బ్రిట‌న్ స‌హా విదేశాల్లో అద్భుతంగా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. దీంతో చెర్రీకి వ‌ర‌ల్డ్ వైడ్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదే అద‌నుగా అత‌డు హాలీవుడ్ లో న‌టించేస్తే త‌న మార్కెట్ ప‌రిధిని అమాంతం విస్త‌రించుకునేందుకు వీలుంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి చ‌ర‌ణ్ ఆ దిశ‌గా ఆలోచిస్తున్నారా?  ప్ర‌స్తుతానికి రాజ‌మౌళి-శంక‌ర్- ప్ర‌శాంత్ నీల్ అంటూ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ట‌పైనే ఫోక‌స్ చేస్తున్నాడా? అన్న‌దానికి మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ఏది ఏమైనా చ‌ర‌ణ్‌ తాజా లుక్ చూడ‌గానే... చెర్రీ ఏంటి బాండ్ - 007 లా స్టైలిష్ గా దిగాడు..! అంటూ చాలా మందికి డౌట్స్ రైజ్ అయ్యాయి.
Tags:    

Similar News