అప్పుడలా..ఇప్పుడిలా....డిసెంబర్ ఇలా!
సంక్రాంతి రిలీజ్ లు అనంతరం సరైన రిలీజ్ లు లేక థియేటర్లు ఎలా వెల వెల బోయాయో తెలిసిందే. సమ్మర్ అయితే ఏకంగా థియేటర్లనీ తాత్కాలికింగా మూసి వేయాల్సి వచ్చింది.
సంక్రాంతి రిలీజ్ లు అనంతరం సరైన రిలీజ్ లు లేక థియేటర్లు ఎలా వెల వెల బోయాయో తెలిసిందే. సమ్మర్ అయితే ఏకంగా థియేటర్లనీ తాత్కాలికింగా మూసి వేయాల్సి వచ్చింది. నిర్మాతలొచ్చి మా సినిమా ల కోసం తెరవండి అని చెప్పే వరకూ కూడా థియేటర్లు తెరుచుకున్న పరిస్థితి లేదు. `హనుమాన్’, ‘డీజే టిల్లు`, `కల్కి 2898`, `కమిటీ కుర్రాళ్లు`, `ఆయ్`, `సరిపోదా శనివారం`, `మత్తు వదలరా-2` లాంటి హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి.
ఇవన్నీ ఒకేసారి రిలీజ్ అయినవి కాదు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్కో ఫేజ్ లో ఒక్కో చిత్రం చొప్పున రిలీజ్ అయ్యాయి. అలా కాస్తా కూస్తో థియేటర్లు ఆ రిలీజ్ లు కారణంగా కళకళలాడాయి. మళ్లీ ఇప్పుడు `దేవర`, `సత్యం సుందరం` లాంటి హిట్ సినిమాల కారణంగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. అన్నింటిని మించి ఎన్టీఆర్ `దేవర`, `కల్కి 2898` లాంటి రిలీజ్ లతో థియేటర్లకు కళ తోడైనట్లు ఉంది.
చిన్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా? అవి ఏదో రూపంలో పైరసీ అవ్వడంతో? వాటికి ఆదరణ తగ్గు తుంది. వాటి కోసం జనాలు థియేటర్ వైపుకు మళ్లకపోవడం అది ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు ఇద్దరు అగ్ర హీరోలు రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న `పుష్ప-2` డిసెంబర్ 6న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న `గేమ్ ఛేంజర్` కూడా డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య కాస్త పోటీ ఉండొచ్చు. రెండు వారాలు గ్యాప్ ఉన్నా? ఇద్దరు అగ్ర హీరోలు కాబట్టి కొంత పోటీ ఉంటుంది. వసూళ్ల పరంగా కొంత వ్యత్యాసం ఉంటుంది.