చీప్, బేస్ లెస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ రాజకీయ విమర్శల్లో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన నాగార్జున, నాగ చైతన్య, సమంతల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-03 09:47 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖ రాజకీయ విమర్శల్లో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన నాగార్జున, నాగ చైతన్య, సమంతల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వ్యక్తిగత జీవితాల గురించి ఆమె చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి. ఐతే మంత్రి వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ మొత్తం ముక్త కంఠంతో ఖండిస్తుంది. సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ అంతా కూడా హ్యాట్ ట్యాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టోలరేట్ ( #FilmIndustryWillNotTolerate) అనే హ్యాష్ ట్యాగ్ తో తమ అసహనాన్ని ఎక్స్ వేదికగా తెలియచేస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలకు చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, అల్లు అర్జున్ స్పందించగా తాజాగా మహేష్ బాబు, రవితేజ, మంచు మనోజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంకా చాలామంది ఎక్స్ వేదికగా తమ స్పందన తెలియచేశారు.

మా సినీ ఫ్యామిలీకి చెందిన ప్రముఖుల మీద కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు బాధించాయి. ఒక కూతురు తండ్రిగా.. ఒక భార్యకు భర్తగా.. ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని.. ఆమె కామెంట్స్ తీవ్రంగా కలచివేశాయని అన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బ తీయనంత వరకు వాక్ స్వేచ్చను వాడుకోవచ్చు. ఈ చీప్, బేస్ లెస్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. సినీ రగాన్ని టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేయొద్ధని కోరుతున్నానని మహిళలను గౌరవ మర్యాదలతో చూడాలని మహేష్ రాసుకొచ్చారు.

ఇక ఇదే విషయంపై రవితేజ స్పందిస్తూ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం తనని భాయాందోళనకు గురి చేసిందని అన్నారు. ఇది చాలా అవమానకరమైన చర్య. తన రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, మహిళలను తీసుకురాకూడదు. సామాజిక విలువలు పెంచేలా రాజకీయ నాయకులు స్పూర్తి ఇవ్వాలని అన్నారు.

ఈ విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా తన స్పందన తెలియచేశారు. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ గారు మాట్లాడిన తీరు చాలా బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వాళ్లను టార్గెట్ చేయడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేసి మాట్లాడటం తప్పని. సురేఖ గారు మొదలు పెట్టింది మీరే.. ఈన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉందని హరీష్ శంకర్ అన్నారు.

ఈ ఇష్యూపై మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ కూడా స్పందించారు. మంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి ఆధారం లేని వ్యాఖ్యలు వినడం బాధాకరమని అన్నారు. సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషం, బేస్ లెస్ ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాని అన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు.

హీరోయిన్ గా తోటి హీరోయిన్ పై మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలపై సంయుక్త మీనన్ స్పందించారు. ఇది ఆమోదయోగ్యం కాని విషయమని అన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇతరుల దృస్టి పడటం కోసం వేరే వాళ్ల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు ఎలా చేస్తారు.. సినీ తారల పేర్లను ఉపయోగించి వారి వ్యక్తిగత జీవితాలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం అమర్యాదకరమని అన్నారు.

తమ రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాల మీద ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక మీదత రాజకీయాలకు మా జీవితాలను దూరంగా ఉంచాలని కోరుతున్నా అంటూ యువ హీరో తేజ సజ్జా ఎక్స్ లో స్పందించారు.

ఈ విషయంపై మేమంతా ఒకే కుటుంబంగా నిరసన తెలియచేస్తున్నా.. క్లిక్స్ కోసం ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్ పెట్టి వీడియోలు పోస్ట్ చేయొద్ధని అభ్యర్ధిస్తున్నా.. ఇతర వృత్తుల మాదిరిగానే మా వృత్తిని గౌరవించండి అని యాంకర్ సుమ కనకాల స్పందించారు.

Tags:    

Similar News