బిగ్ బాస్ 8 : చీఫ్ వేటలో నబీల్ ప్రేరణ.. హౌస్ మేట్స్ ఓట్ ఎవరికి అంటే..?

ఇక ఈరోజు ప్రోమో చూస్తే టెడ్డీ ఆటలో చివరగా ప్రేరణ, నబీల్ ఉన్నట్టు తెలుస్తుంది.

Update: 2024-10-03 12:45 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రతి వారం చీఫ్ ఎంపిక తెలిసిందే. ఈ వారం కూడా చీఫ్ వేట కొనసాగుతుంది. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ గెలిచిన కారణంగా నిఖిల్ శక్తి క్లాన్ నుంచి ఒకరు డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ గా నిలిచే అవకాశం ఇచ్చారు. ఐతే కాంతారా క్లాన్ తో పాటు మిగతా హౌస్ మెట్స్ కు టెడ్డీ గేం పెట్టి వారిలో చివరి వరకు మిగిలిన వారిని చీఫ్ వేటలో నిలిచేలా చేశారు. ఐతే బుధవారం మొదలైన ఈ ఆట ఈరోజు కూడా కొనసాగుతుంది.

ఇక ఈరోజు ప్రోమో చూస్తే టెడ్డీ ఆటలో చివరగా ప్రేరణ, నబీల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే చివరిగా ఆదిత్య ఓం ఆట నుంచి తప్పుకోవడం వల్ల అతను సంచాలక్ గా ఉండి వారిద్దరి మధ్య ఒకరిని చీఫ్ కంటెండర్ గా పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆదిత్య ఓం ప్రేరణకు ఆ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లేటేస్ట్ ప్రోమో చూస్తుంటే ఆదిత్య ఓం ప్రేరణకు సపోర్ట్ చేసి నబీల్ ని తీసేసినట్టు తెలుస్తుంది.

ఐతే పృధ్వి, ప్రేరణ ఇద్దరు మధ్య జరిగే టాస్క్ లో ఎవరు ఈ వారం కొత్త చీఫ్ అవుతారన్నది చూడాలి. ఐతే చీఫ్ గా ఎంపిక కాబడిన వారికి కొన్ని స్పెషల్ సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టే అందరు చీఫ్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు. రెండు క్లాన్ లకు ఈ వారం కొత్త చీఫ్ లు వస్తే కచ్చితంగా ఆట రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 8 లో వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దాదాపు కన్ ఫర్మ్ అయ్యాయి. ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. ఐతే ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ చేసిన కంటెస్టెంట్స్ ని తెచ్చి షోని మరింత సక్సెస్ అయ్యేలా చేసేందుకు చూస్తున్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ టీం ప్లాన్ ఎంత వర్క్ అవుట్ అవుతుంది అన్నై ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక తెలుస్తుంది. ఐతే షో మీద ఇప్పటికేఆడియన్స్ ఒక క్లారిటీకి వచ్చారు కాబట్టి రాబోయే వారాల్లో ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News