రామ్ చరణ్ నిజంగా గ్రేట్

Update: 2017-12-23 02:30 GMT
ప్రస్తుతం స్టార్ హీరోలు న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా క్రిస్మస్ కోసం కూడా కొన్ని ప్రత్యేకమైన పార్టీలను చేసుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరైతే ఏకంగా విదేశాలకు వెళుతున్నారు. మరికొందరు స్టార్ హీరోలు ఫ్యామిలీ తో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోల ఇళ్లల్లో ఇప్పటికే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

అయితే ఎవరికి వారు సొంతంగా ఎంజాయ్ చేస్తోన్న తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం చాలా వినూత్నంగా క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు. సతీమణి ఉపాసనతో కలిసి  ప్రభుత్వేతర సంస్థ ఆశ్రయ్ - అక్రూతి లోని పిల్లలతో ఆనందంగా గడిపారు. వారితో కలిసి చరణ్ కేక్ ను తయారు చేశాడు. అంతే కాకుండా డ్యాన్సులు చేశాడు. ఇంకా వారిలో కలిసిపోతు మెగా దంపతులు నవ్వులు పూయించారు. ఇక వారందరికీ గుర్తుండిపోయేలా ఒక ఫొటోను కూడా దిగారు.

ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..మిస్టర్ సి హాలిడేస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని విధంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం  మెగా అభిమానులను ఆ వీడియో చాలా ఆకట్టుకుంటోంది.
Tags:    

Similar News