సైరా హిందీ వెర్షన్.. కారణం చెప్పిన చరణ్

Update: 2019-10-27 16:15 GMT
రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన హిస్టారికల్ చిత్రం 'సైరా' తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లే నమోదు చేసింది కానీ హిందీ వెర్షన్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.  రివ్యూలు పాజిటివ్ గానే వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.  దీంతో 'సైరా' టీమ్ అంచనాలు తప్పాయి.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయంపై మాట్లాడాడు.

హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన వార్ తో పోటీపడడంతోనే 'సైరా' కలెక్షన్స్ తక్కువగా వచ్చాయని తేల్చేశాడు. "హిందీలో ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండాల్సింది. అయితే వార్ 300 కోట్లు వసూలు చేస్తే సైరా సౌత్ లోనే దాదాపు రూ. 275 కోట్లు వసూలు చేసింది" అన్నాడు.  పోటీ వల్ల 'సైరా' కు హిందీలో నష్టం జరిగిందని చరణ్ అభిప్రాయపడుతున్నప్పటికీ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేయకపోవడం.. చిరంజీవి నార్త్ లో పెద్ద స్టార్ కాకపోవడం లాంటి పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ చేయబోయే ఫ్యూచర్ సినిమాలకు 'సైరా' అనుభవాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.  స్ట్రాంగ్ ప్రమోషన్ స్ట్రేటజీ లేకుండా.. పోటీలో సినిమాను రిలీజ్ చేస్తే ఇబ్బందులు తప్పవు అని 'సైరా' పాఠం నేర్పించినట్టే.


Tags:    

Similar News