'సైరా' సందడేది చరణ్ !

Update: 2019-09-08 14:30 GMT
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సైరా' రిలీజ్ కి ఇంకా 25 రోజులే ఉంది. అయితే  ఇంతవరకూ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ లేదు. నిజానికి  ఓ బడా సినిమా వస్తుందంటే ఎలాంటి హంగామా ఉండాలి. అదీ మెగాస్టార్ సినిమా. ఈపాటికే  సోషల్ మీడియాలో సందడి మొదలవ్వాలి. పోస్టర్లు - సాంగ్స్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయాలి. కానీ 'సైరా' విషయంలో అలాంటిదేం జరట్లేదు. 'సాహో' కి సంబంధించి ఓ రెండు నెలల ముందు నుండే గట్టిగా ప్రమోషన్స్ చేసారు. నెల ఉందనగా ప్రభాస్ ముంబై  - చెన్నై - బెంగళూరు అన్నీ తిరిగి అక్కడ కూడా ప్రమోట్ చేసుకొచ్చాడు. అందుకే 'సాహో' కి ఆ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో నెలకొన్నాయి.

కానీ 'సైరా' టీం మాత్రం ఇంకా ప్రమోషన్స్ మొదలుపెట్టనే లేదు. నెల ముందు నుండే సినిమాకు ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తాడనుకుంటే చరణ్ కూడా సైలెంట్ గా ఉన్నాడు.  'సాహో' కి భారీ ప్రమోషన్స్ వల్ల చాలా హైప్ వచ్చింది. ఆ హైప్ ను సినిమా అందుకోలేకపోయింది. బహుశా 'సాహో' ని దృష్టిలో పెట్టుకొని సైరా ప్రమోషన్స్ లో లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా ... ? అనే డౌట్ కూడా ప్రేక్షకులకు కలుగుతుంది.

ఈ వారంలో కర్నూల్ లో 'సైరా' కి సంబంధించి గ్రాండ్ గా ఓ ఈవెంట్ నిర్వహించాలని చూస్తున్నారట మేకర్స్. దీనికీ పనులు కూడా మొదలయ్యాయట. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీ కాంత్ - బిగ్ బీ అమితాబ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడని తెలుస్తుంది. అక్కడి నుండి ప్రమోషన్స్ మొదలు పెట్టి ఓ ప్రణాళిక ప్రకారం ప్రమోషన్స్ చేయాలనీ చరణ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి రిలీజ్ కి ముందు 'సైరా' ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో


Tags:    

Similar News