మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ `RRR`. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ఈ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. 1920 ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేపథ్యంలో ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ల ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించారు.
మే 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అక్కడ కూడా పలు రికార్డుల్ని తిరగరాస్తూ హాలీవుడ్ మేకర్స్ తో పాటు స్టార్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ లో పదిహేను వారాలుగా టాప్ లో నిలుస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా వుంటే ఇంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ మూవీలో నటించిన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు.
అయితే ఆ క్రేజ్ ని ఉపయోగించుకోవడం లేదనే కామెంట్ లు ఇటీవల విడినిపించిన విషయం తెలిసిందే. `పుష్ప`తో పాన్ ఇండియా వైగ్ గా క్రేజ్ ని దక్కించుకున్న బన్నీ ఆ క్రేజ్ తో వరుస బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ లు చేస్తూ వరుస కమర్షియల్ యాడ్ లలో నటిస్తూ జోరు చూపిస్తున్నారు. అయితే చరణ్, ఎన్టీఆర్ మాత్రం `RRR` క్రేజ్ ని ఆ స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోతున్నారని ఫ్యాన్స్ తో పాటు పలువురు కామెంట్ లు చేశారు.
అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ కొంత వెనకబడి వుంటే రామ్ చరణ్ మాత్రం దూకుడు పెంచేశాడు. ఇటీవల హీరో కంపనీకి చెందిన గ్లామర్ బైక్ కి ప్రచార కర్తగా సైన్ చేసిన చరణ్ దీనికి సంబంధించిన కమర్షియల్ యాడ్ షూట్ ని మెరుపు వేగంతో పూర్తి చేసేశాడట. 30 సెకన్ల పాటు సాగే ఈ యాడ్ ని అడ్వెచరస్ గా షూట్ చేసినట్టుగా తెలిసింది. ఇదిలా వుంటే తాజాగా చరణ్ మరో బ్రాండ్ కు ప్రచార కర్తగా సైన్ చేసినట్టుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఇది ఏ కమర్షియల్ బ్రాండ్ అన్నది మాత్రం ఇంకా బయటికి రాదు. అంతే కాకుండా ఇప్పటి వరకు హీరో గ్లామర్ యాడ్ తో పాటు మరో రెండు బ్రాండ్ లని కూడా చరణ్ ఓకే చేశారట. మరిన్ని లైన్ లో వున్నాయని చెబుతున్నారు.
చరణ్ ని చూస్తుంటే మునుపటికి మించి కమర్షియల్ యాడ్స్ విషయంలో దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోందని చెబుతున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ `ఇండియన్ 2` షూటింగ్ లో బిజీగా వుండటంతో చరణ్ కు మంచి టైమ్ లభించింది. ఆ టైమ్ ని కమర్షయల్ బ్రాండ్ ల కోసం చరణ్ వాడుకుంటుండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.