బ్రూస్ లీ.. అది కూడా ఒక రికార్డే

Update: 2015-09-28 11:30 GMT
అక్టోబర్ 16న ఎట్టిపరిస్థితిల్లోనూ రిలీజవుతుంది... ఇది బ్రూస్ లీ మాట. దసరా పండగనాటికి థియేటర్లలో ఉండాల్సిందే... ఇది రామ్ చరణ్ అల్టిమేటం. థియేటర్లు రెడీ చేసేసుకోండి... ఇది డిస్ట్రిబ్యూటర్లకిచ్చిన సమాచారం. అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి. కానీ అంత పర్ఫెక్ట్ గా చెప్పిన టైం కి రావడం సాధ్యమా అన్నదే ఇప్పుడు ప్రశ్న. అక్టోబర్ 7న బ్రూస్ లీ షూటింగ్ కి ఫినిష్ చేయాలని డేట్ లాక్ చేశారు. అంటే.. అక్కడి నుంచి 9వ రోజు కల్లా థియేటర్లలో ఉండాలి.

ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం థియేటర్లలో - ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ మొదలుపెట్టాలంటే సెన్సార్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. కనీసం 5 రోజులు ముందు సెన్సార్ కి పంపాలి. అంటే మినిమం 3 రోజుల ముందైనా అప్లై చేయాలి. ఈ లెక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ 9 -10 తేదీలకల్లా ఫస్ట్ కాపీ చేతిలో ఉండాలి. ఏడో తారీఖున షూటింగ్ ఫినిష్ చేసి.. పదో తేదీ నాటికి ఫస్ట్ కాపీ చేతిలో ఉండడమంటే.. 3 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వాలి. మొత్తం మూవీకి ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఈ లెక్కన ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

ఇంతే కాదు.. బ్రూస్ లీకి ఇంకా ఆడియో ఫంక్షన్ చేయాలి. అక్టోబర్ 2న చేస్తామని ప్రకటించారు. యూనిట్. ప్రమోషన్ కార్యక్రమాలను ఆ రోజునుంచే మొదలుపెడతారని అనుకోవచ్చు. ఇన్నీ ఈ 15 రోజుల్లో కంప్లీట్ చేసేస్తామని టీం ధీమాగానే చెబ్తోంది. ఎందుకంటే. ఇవన్నీ సెపరేట్ వర్క్స్. ఒక్కోటి ఒక్కో డిపార్ట్ మెంట్ చేసేవి కాబట్టే.. అంత ధైర్యంగా ఉన్నారు. అయినా.. కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేస్తే.. అది కూడా ఒక రికార్డే.
Tags:    

Similar News