చెర్రీకి శుక్రవారం విలువ తెలిసిందా!!

Update: 2015-10-14 11:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ.. బ్రూస్ లీ ది ఫైటర్.. ఈ శుక్రవారం థియేటర్ లలోకి వచ్చేస్తోంది. ఇక్కడ బ్రూస్ లీ కంటే శుక్రవారం గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. సాధారణంగా సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయ్ కదా.. మళ్లీ ఆ రోజు గురించి చెప్పుకునేది ఏముంటంది అనుకోవచ్చు. కానీ.. చెర్రీకి ఫ్రైడే సెంటిమెంట్ లేదు. రెండు సెలవు రోజులు కలిసొస్తే చాలు.. వారం మధ్యలో అయినా ఎండింగ్ లో అయినా.. ఎడాపెడా రిలీజ్ చేసేస్తాడు.

చెర్రీ నటించిన చివరి మూడు చిత్రాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. గోవిందుడు అందరివాడేలే - నాయక్ చిత్రాలు బుధవారం రోజున రిలీజ్ అయ్యాయి. అలాగే ఎవడుని ఆదివారం రోజున దించాడు మెగాపవర్ స్టార్. అన్ని సినిమాలు బాగానే ఫేర్ చేశాయి. ఏదీ నలభై కోట్లకు తగ్గలేదు. చెర్రీ ఐడియాలు బాగానే క్లిక్ అయ్యాయి. కానీ.. ఇలా వర్కవుట్ అయింది ఇండియాలో మాత్రమే. ఓవర్సీస్ మార్కెట్లో వీకెండ్స్ కి మాత్రమే డిమాండ్ ఉంటుంది. మధ్యలో వచ్చే సినిమాలకు అంతగా డిమాండ్ ఉండడం కష్టం. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాడు చరణ్. అందుకే ఈసారి పక్కాగా శుక్రవారమే రిలీజ్ ప్లాన్ చేశాడు.

ఇప్పటివరకూ చెర్రీకి ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మూవీ లేకపోవడానికి ఇది కూడా కారణమే అంటారు విశ్లేషకులు. మొత్తానికి యూఎస్ లోనూ మిలియన్ డాలర్ హీరో అనిపించుకోవడానికి చెర్రీ డిసైడ్ అయ్యాడు. శ్రీనువైట్ల డైరెక్టర్ కావడంతో.. అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బ్రూస్ లీకి మొదటి వీకెండ్ కే యూఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ ఖాయమంటున్నారు.
Tags:    

Similar News