మొదటి పరీక్ష ధృవకేనా!?

Update: 2016-12-04 16:34 GMT
డీమానిటైజేషన్ తర్వాత రిలీజ్ అవుతున్న తొలి భారీ బడ్జెట్ మూవీ.. రామ్ చరణ్ ధృవ. పెద్ద నోట్లు రద్దు అయ్యి.. కరెన్సీ కోసం కష్టాలు పడాల్సి వస్తున్న ప్రస్తుత పరిస్థితిలో.. జనాలు తమ దగ్గరున్న నోట్లు ఖర్చు పెట్టేసి థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారా అనే ప్రశ్నకు 'ఎక్కడకు పోతావు చిన్నవాడా' ఓ సమాధానం ఇచ్చింది.

కానీ చిన్నవాడితో పోల్చితే.. ధృవకు చాలా పెద్ద పరీక్ష ఎదురవుతుంది. ఏ క్లాస్ సెంటర్లలో మినహాయిస్తే.. బీ-సీ సెంటర్లలో నామమాత్రపు కలెక్షన్స్ కూడా నిఖిల్ మూవీ సంపాదించలేకపోయింది. కానీ ధృవ విషయంలో అలాంటివి చెల్లవు. నిఖిల్ సినిమాకి ఫుల్ రన్ 20 కోట్ల షేర్ వస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ రామ్ చరణ్ మూవీకి షేర్ రూపంలోనే కనీసం 50 కోట్లకు పైగా వస్తే తప్పితే.. యావరేజ్ అనే పరిస్థితి లేదు. సో.. చిన్నవాడు పాసయిపోయాడు కాబట్టి.. చెర్రీకి లైన్ క్లియర్ అనుకోవడానికి లేదు.

ఇక్కడ ఎవరి పరీక్ష వాళ్లే రాస్కోవాలి. మీడియం బడ్జెట్ మూవీగా చిన్నవాడు మంచి మార్కులతో పాసయిపోయాడు. కానీ డీమానిటైజేషన్ తర్వాత వస్తున్న తొలి భారీ బడ్జెట్ మూవీ ధృవ మాత్రమే. చెర్రీ డిస్టింక్షన్ లో పాసయితే.. చాలామందికి తమ సినిమాలను విడుదల చేసేందుకు ఎనలేని ధైర్యం వచ్చేస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News