‘ధృవ’ సినిమాలో అరవింద్ స్వామితో కలిసి నటించే విషయంలో తాను భయపడ్డానని అన్నాడు రామ్ చరణ్. ‘‘అవును.. అరవింద్ స్వామిని చూసి భయపడ్డా. అలాంటి పవర్ ఫుల్ యాక్టర్ ముందు నేనెలా నటిస్తానో అని కంగారు పడ్డాను. అందులోనూ సినిమాలో ఆయనది పవర్ ఫుల్ రోల్. అయితే రోజులు గడిచాక మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య చక్కటి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా వర్కవుటైంది’’ అని చరణ్ తెలిపాడు.
ఇక రీమేక్ సినిమాలు చేయడంలో తనకు అభ్యంతరాలేమీ లేవని చరణ్ చెప్పాడు. ‘‘బ్రూస్ లీ తర్వాత సేఫ్ గేమ్ ఆడదామని ‘తనీ ఒరువన్’ రీమేక్ ను ఎంచుకోలేదు. ఆ సినిమా నాకు నచ్చింది. చాలా డిఫరెంటుగా ఉందనిపించింది. నా కమ్ బ్యాక్ కు ఇది బాగా ఉపయోగపడుతుందనిపించింది. రీమేక్ సినిమాలు చేయడంలో తప్పేమీ లేదు. ఇకపై రీమేక్స్ చేయనని సూరి ఎందుకన్నాడో కానీ.. అతను ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు. అతనన్నట్లు రీమేక్ సినిమా చేయడం చాలా కష్టం’’అని చరణ్ తెలిపాడు.
ఇక తన తర్వాతి సినిమా సుకుమార్ తో ఉంటుందన్న చరణ్.. అది సంక్రాంతి తర్వాత సెట్స్ మీదికి వెళ్తుందని చెప్పాడు. తన తండ్రి రీఎంట్రీ మూవీకి నిర్మాతగా వ్యవహరించడం పెద్ద బాధ్యత అని.. వినాయక్ దర్శకుడు కావడం వల్ల తన మీద చాలా భారం తగ్గిందని.. అతనే అన్ని పనులూ చూసుకున్నాడని తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/