దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయడం అంటే.. యాక్టర్స్ కు అదో సుదీర్ఘమైన ప్రస్థానమే. దాదాపు ఇప్పటివరకూ సుక్కు చేసిన సినిమాలన్నీ ఈ బాపతుగానే ఉంటాయి. ప్రస్తుతం సుకుమార్ తో రంగస్థలం 1985 మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. నిజానికి ఈ సినిమాను దీపావళి నాటికే సిద్ధం చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ప్రోగ్రెస్ అనుకున్నట్లుగా సాగకపోవడంతో.. జనవరికి వాయిదా వేసుకున్నారు. ఆ డేట్ మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయ్ కానీ.. రీసెంట్ గానే నిర్మాతలు సంక్రాంతికి రంగస్థలం రిలీజ్ ఖాయమని చెప్పేశారు.
ఈ చిత్రం కోసం గత కొన్ని వారాలుగా ఓ సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందనే అంచనాలు యూనిట్ లో ఉండడంతో.. భారీ శ్రమకు ఓర్చి పిక్చరైజ్ చేశారట. దీంతో చెర్రీ.. సుకుమార్ ఇద్దరూ మూవీ షూటింగ్ కు కొంత బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుని.. వారం రోజుల పాటు బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా రామ్ చరణ్ కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో కనిపించడంతో.. ఈ బ్రేక్ సంగతి ఖాయం అయింది. అయితే.. వారం బ్రేక్ తీసుకుని చెర్రీ వెకేషన్ కు వెళ్లడం లేదని.. అక్కడ ఓ నేచర్ క్యూర్ హాస్పిటల్ కు వెళుతున్నాడని తెలుస్తోంది.
సహజంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ల పిక్చరైజేషన్ సమయంలో ప్రధాన నటులకు కొన్ని గాయాలు.. కండరాలు పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి ప్రకృతి చికిత్స తీసుకుని తిరిగి ట్రాక్ లోకి వచ్చేస్తుంటారు మన యాక్టర్స్. ఇషా ఫౌండేషన్ కు చెందిన సద్గురు రీసెంట్ గా రామ్ చరణ్ ఇంటిని సందర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కూడా అక్కడకే వెళుతున్నాడని టాక్.