సాహో' ని మించి 'సైరా' ఈవెంట్లు

Update: 2019-08-20 05:42 GMT
టాలీవుడ్ లో ఒకేసారి రెండు భారీ చిత్రాలు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సైరా.. - యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న `సాహో`  .. ఇవి రెండూ అత్యంత భారీ కాన్వాసుతో భారీ బడ్జెట్ల‌తో తెర‌కెక్కుతున్నాయి. ఆగ‌స్టు 30న సాహో రిలీజ‌వుతుంటే.. నెల‌రోజుల గ్యాప్ తో అక్టోబ‌ర్ 2న సైరా-న‌ర‌సింహారెడ్డి చిత్రం రిలీజ‌వుతోంది. దీంతో ఈ రెండు సినిమాల‌ మ‌ధ్య అంత‌కంత‌కు వార్ పెరుగుతోంద‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు అందుతున్నాయి. ఆ రెండు భారీ చిత్రాల న‌డుమ పోటీ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.

కాస్టింగ్ .. బ‌డ్జెట్లు.. విజువ‌ల్ నాణ్య‌త‌.. వ‌ర్కింగ్ కాన్వాస్.. ప్ర‌మోష‌న్.. ఇలా అన్ని కోణాల్లో ప‌రిశీలిస్తే ఇవి రెండూ ఒక‌దానికొక‌టి తీసిపోనివేన‌న్న చ‌ర్చా సాగుతోంది. రెండు సినిమాల్లోనూ అన్ని భాష‌ల స్టార్ల‌ను ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్- కోలీవుడ్ స్టార్లు సాహో.. సైరా రెండు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. ఇక‌పోతే సాంకేతిక నిపుణుల్ని హాలీవుడ్  నుంచి ర‌ప్పించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ వీఎఫ్ ఎక్స్ స్టూడియోల్లో ఎఫెక్ట్స్ ప‌నులు చేశారు. అయితే జోన‌ర్ ప‌రంగా ఇవి రెండూ ఎంతో వైవిధ్య‌మైన‌వి కావ‌డం ఆ ఇద్ద‌రికీ ప్ల‌స్ అనే చెప్పాలి. జోన‌ర్లు చూస్తే.. సాహో భారీ యాక్ష‌న్ చిత్రం. `సైరా` స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి చిత్రం. ఈ రెండిటిలోనూ భారీ యాక్ష‌న్ అబ్బుర ప‌ర‌చ‌నుంది. సైరా చిత్రంలో వార్ ఎపిసోడ్స్ `బాహుబ‌లి` త‌ర‌హాలో మైమ‌రిపించ‌నున్నాయ‌న్న టాక్ ఉంది. ఇక సాహో యాక్ష‌న్ దృశ్యాలు ఇటీవ‌ల రిలీజైన భారీ హాలీవుడ్ చిత్రాల త‌ర‌హాలో చిత్రీక‌రించారు. యాక్ష‌న్ - ఛేజ్ లు- రిచ్ విజువ‌ల్స్ అబ్బుర‌ప‌ర‌చ‌నున్నాయి.

ఇక ప్ర‌చారం ప‌రంగా చూస్తే .. ఇండియాలోనే నెవ్వ‌ర్ బిఫోర్ అన‌ద‌గ్గ రీతిలో రామోజీ ఫిలింసిటీలో `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. దాదాపు 2కోట్లు వెచ్చించి కొన్ని ఎక‌రాల స్థ‌లంలో సాహో స్టేజీని నిర్మించారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఈవెంట్ కి ఏకంగా ల‌క్ష మంది డార్లింగ్ ఫ్యాన్స్ పోటెత్తారు. వేదిక‌పై దిగ్గ‌జాలు అద్భుత‌మైన స్పీచ్ లు ఇచ్చారు. ఈ ఈవెంట్ ని దేశ‌-విదేశాల్లోని ప్ర‌భాస్ అభిమానులు వీక్షించారు. అందుకే ఇప్పుడు ఆ ఈవెంట్ ని కొట్టే రేంజులో `సైరా` నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ని మించేలా హైద‌రాబాద్ లో అదిరిపోయే ఈవెంట్ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో సాహో ఈవెంట్ ని మించి చేయ‌లన్న ఆలోచ‌న‌తో చ‌ర‌ణ్ ఉన్నార‌ట‌. అలాగే బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ముంబైలో ప్రెస్ మీట్ పెద్ద రేంజులో చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇక ఆగ‌స్టు 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే కాబ‌ట్టి అంత‌కు ముందే(మంగ‌ళ‌వారం) టీజ‌ర్ రిలీజ‌వుతోంది. సాహో త‌ర‌హాలోనే `సైరా` బ‌హుభాషా చిత్రం.. అందుకు త‌గ్గ ప్ర‌చారానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే దేశంలోని అన్ని మెట్రో న‌గ‌రాల్లో సాహో చిత్రానికి చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి మ‌రీ సునామీ ప్ర‌చారం చేస్తున్నారు. అదే తీరుగా చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్‌- సురేంద‌ర్ రెడ్డి బృందం `సైరా` ప్ర‌చారాన్ని ఈ నెల‌రోజులు భారీగా చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్ విజువ‌ల్స్ తో రెండు భారీ చిత్రాలు నెల‌రోజుల గ్యాప్ లో వ‌స్తుండ‌డంతో అభిమానుల‌కు క‌న్నుల పండుగ‌గా ఉంది. సాహో- సైరా చిత్రాలు పెద్ద రేంజులో స‌క్సెస‌వ్వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెబ‌ల్ ఫ్యాన్స్ .. మెగా ఫ్యాన్స్ ప్ర‌స్తుతం సంబ‌రాలు చేసుకుంటున్నారు.


Tags:    

Similar News