టెక్నాలజీ ఎంతగా ముదిరిపోయిందంటేనిజాన్ని ఫేక్ గా చూపించగలదు... ఫేక్‌ని నిజం చేయగలదు. ఏది ఫేకో ఏది నిజమో తెలియక మనం జుట్టు పీక్కోవాలి. ఇలాంటి పరిస్థితే ఎదురైంది రంగస్థలం పబ్లిసిటీ టీమ్‌కి. ట్విట్టర్ పెట్టిన పోస్టర్ నిజం కాదంటూ ఒకటే గోల చేస్తున్నారు నెటిజన్లు. కాదు అది నిజమే అని వాదిస్తోంది పబ్లిసిటీ టీమ్.
రంగస్థలం సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వబోతోంది. అమెరికాలో కూడా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడి పబ్లిసిటీ బాధ్యతలు చూస్తున్నది క్రియేటివ్ సినిమాస్ అనే సంస్థ చూస్తోంది. కాగా న్యూయార్క్ ను న్యూజెర్సీని కలిపే వంతెన లింకన్ టన్నెల్. మన తెలుగు వాళ్లు ఎక్కువగా నివసించేది న్యూజెర్సీలోనే. న్యూజెర్సీ నుంచి లింకన్ టన్నెల్ మీదుగా న్యూయార్క్‌లోని ఆఫీసులకు వెళ్తుంటారు. ఆ లింకన్ టనెల్ దగ్గరే రంగస్థలం డిజిటల్ బ్యానర్ పెట్టారు. దానికి ఫోటో తీసి ట్విట్టర్ లో పెట్టారు. నెటిజన్లు అది నిజమైన బ్యానర్ లా లేదని... ఫోటోషాప్ చేసి పెట్టినట్టు ఉందని కామెంట్లు పెట్టారు. దానికి క్రియేటవ్ సినిమాస్ వారు కాదు అది నిజమైన పోస్టరే అని రీట్వీట్ చేశారు. అయినా మన నెటిజన్లు ఊరుకుంటారా... అది నిజం డిజిటల్ బ్యానరే కావచ్చు కానీ అలా కనిపించడం లేదు అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. వారిని నమ్మించడం ఎవరి తరం అవుతుంది చెప్పండి. అమెరికాలో ఉన్న ఏ తెలుగు వాడో చెప్పాలి.
రంగస్థలం విడుదలకు ముందు ప్రచారానికి కావాల్సినంత వివాదాలు జరుగుతున్నాయి. మొన్నటిమొన్న రంగమ్మ మంగమ్మ పాటలో గొల్లభామ అన్న పదం వాడినందుకు అభ్యంతరం చెప్పారు యాదవ సంఘాలు. ఆ పదాన్ని తీసేయాలని లేకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని అన్నారు. అంతకుముందు సమంత గేదెలు కడగడాన్ని చూడలేక పోయారు ఆమె అభిమానులు. ఇవన్నీ కూడా రంగస్థలానికి ప్లస్ పాయింట్లే అవుతాయి కానీ మైనస్ లు కావు. వీటి ద్వారా కావాల్సినంత ఉచిత ప్రచారం కూడా వస్తోంది.