రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్ బైజాన్ లో జరుపుకుంటోంది. #RC12 గా పిలుచుకునే ఈ సినిమా టైటిల్ ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఈమధ్య చిరంజీవి పాత సినిమా 'స్టేట్ రౌడీ' టైటిల్ ఈ సినిమా కు వాడాలని బోయపాటి అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆదంతా తూచ్.
ఈ సినిమా ప్రొడ్యూసర్ DVV దానయ్య రీసెంట్ గా 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ డిఫరెంట్ టైటిల్ చరణ్ - బోయపాటి సినిమా కోసమే అయి ఉంటుందని దసరా సీజన్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు టైటిల్ రిజిస్టర్ చేయడం జరిగిందని అంటున్నారు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా బోయపాటి గత చిత్రం 'జయ జానకీ నాయక' స్టైల్ లో సౌండింగ్ ఉండడం కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
మరి ఇలాంటి క్లాస్ టైటిల్ చరణ్ అభిమానులకు నచ్చుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమాకు 'వినయ విధేయ రామ' టైటిల్ కనుక ఫిక్స్ అయితే బోయపాటి తన సినిమా టైటిల్స్ విషయం లో పూర్తిగా రూట్ మార్చినట్టే. ఇక టైటిల్ పై క్లారిటీ రావాలంటే మరో వారం రోజులు వేచి చూడాలి.