ఇటీవల మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 29న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డారు. మైనర్ లక్షణాలే అయినప్పటికీ అభిమాన హీరోలకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. అయితే వరుణ్ తేజ్ ఇప్పటికే కరోనాను జయించి బయటపడ్డాడు. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ కూడా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ ని తాజాగా చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలో రెండు సార్లు నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య'లో రామ్ చరణ్ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రత్యేకంగా వేసిన అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. వాస్తవానికి జనవరి ఫస్ట్ వీక్ నుంచి చిరు - చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలు షూట్ చేయడానికి కొరటాల ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే సమయంలో చరణ్ కి కరోనా సోకి క్వారంటైన్ లో ఉండటంతో ప్లాన్స్ మార్చుకున్నారు. ఇప్పుడు జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో చరణ్ - చిరంజీవి మీద సీన్స్ తీస్తారని అంటున్నారు. దీని తర్వాత చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' లో తన పాత్ర మిగిలిన షూట్ ని పూర్తి చేస్తాడని తెలుస్తోంది.