మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు రిలీజైన సంగతి తెలిసిందే. ఐతే చిత్ర బృందానికి చెందిన వాళ్లు కాకుండా బయటి వ్యక్తుల్లో ముందు ఈ టీజర్ చూసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట. సోషల్ మీడియాలో లాంచ్ చేయడానికి అరగంట కంటే ముందే పవన్ ఈ టీజర్ చూశాడట. మంగళవారం రాత్రి నిర్వహించిన మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకల్లో చరణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఉదయం 10.45 నిమిషాలకు తన దగ్గరికి టీజర్ వచ్చిందని.. దాన్ని వెంటనే వాట్సాప్ ద్వారా పవన్ బాబాయికి పంపానని చరణ్ తెలిపాడు.
పది నిమిషాల తర్వాత పవన్ నుంచి రిప్లై వచ్చిందని.. టీజర్ అదిరిపోయిందని.. థియేటర్లో ఎప్పుడెప్పుడూ సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నానని పవన్ అన్నాడని చరణ్ చెప్పాడు. ఇది అభిమానుల్ని ఉత్సాహపరచడానికి ఊరికే అంటున్న మాట కాదని.. ఇది వాస్తవం అని చరణ్ తెలిపాడు. ముందు పవన్ ఈ టీజర్ విషయంలో తమను ఆశీర్వదించాడని.. ఆ తర్వాత అభిమానుల ఆశీస్సులూ అందాయని.. టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చిందని చరణ్ చెప్పాడు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఐతే ఈసారి చిరు పుట్టిన రోజు ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో తానే దర్శకుడు సురేందర్ రెడ్డిని అడిగి టీజర్ చేయించుకున్నానని చరణ్ తెలిపాడు. ఇప్పటికి ఈ చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయినట్లు చరణ్ తెలిపాడు. ఇంకా విడుదలకు 8-10 నెలల సమయం ఉందన్నాడు. సరిగ్గా సమయం చెప్పలేనని.. కానీ వచ్చే ఏడాది వేసవిలో ఏదో ఒక తేదీకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని చరణ్ స్పష్టం చేశాడు. టీజర్ కంటే సినిమా ఇంకా బాగుంటుందని.. అందరం కలిసి కష్టపడి సినిమాను బాగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చరణ్ చెప్పాడు.