ధృవ చెప్పాడనే చరణ్ సిక్స్ ప్యాక్

Update: 2016-12-04 11:30 GMT
ధృవ మూవీకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయ్ కానీ.. ఇమ్మీడియేట్ గా ఈ చిత్రంపై అటెన్షన్ పెంచేలా చేసిన పాయింట్ మాత్రం.. రామ్ చరణ్ చేసిన సిక్స్ ప్యాక్. థియేట్రికల్ ప్రారంభంలోనే బేర్ బాడీతో సిక్స్ ప్యాక్ చూపించేశాడు చెర్రీ. ఇప్పటివరకూ చాలానే పవర్ ఫుల్ రోల్స్ చేశాడు కానీ.. సిక్స్ ప్యాక్ విషయంలో కాసింత ఆలస్యం చేశాడు రామ్ చరణ్.

అయితే.. ధృవ కేరక్టర్ డిమాండ్ చేయడంతోనే సిక్స్ ప్యాక్ చేశానంటున్నాడు ఈ మెగా హీరో. పాత్ర కోసం వీలుగా మారేందుకు తాను ఎప్పుడూ సిద్ధమన్న చెర్రీ.. ధృవ రోల్ కోసం చేసిన వర్కవుట్స్.. తనకు పర్సనల్ గా కూడా హెల్ప్ అయ్యాయని అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నప్పుడు ఫిట్ గా ఉండడం అవసరం అంటూనే.. సిక్స్ ప్యాక్ కోసం స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అయ్యానని చెప్పాడు. తనకు ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ ఫుడ్-స్వీట్స్ కి దూరంగా ఉండాల్సొ్చ్చినా.. అతి కష్టం మీద కోరికలను కంట్రోల్ చేసుకున్నట్లు చెప్పాడు.

అటు ధృడంగా కనిపిస్తూనే.. ఇటు సన్నగా ఉండడం కోసం చెర్రీ చాలానే కష్టపడాల్సి వచ్చిందట. అయితే.. తన కష్టాన్ని కేవలం వర్కవుట్స్ చేసేటప్పుడు మినహాయిస్తే.. తర్వాత పెద్దగా ఖాతరు చేయలేదంటున్నాడు రామ్ చరణ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News