ఆ ఐదు నిమిషాలు మెరుపులే - చెర్రీ

Update: 2015-10-02 18:11 GMT
స్పీచ్ స్టార్ట్ చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇబ్బంది పడతాడు కానీ... ఓ సారి స్టార్ట్ చేశాక ఓ రేంజ్ లో రెచ్చిపోతాడు. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్లో కూడా అదే జరిగింది. చాలా ఫాస్ట్ గా బ్రూస్ లీ మూవీని కంప్లీట్ చేశామని చెర్రీ చెప్పాడు. " ఇంత ఫాస్ట్, ఇంత క్వాలిటీ రావడానికి కారణం శ్రీను వైట్ల. మేం మే నెలలో స్టార్ట్ చేశాం.. ఐదు నెలలు షూట్ చేసి.. ఆరో నెలలో రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇలా జరుగుతోంది. రెండు యూనిట్స్ తో షూటింగ్ చేసేందుకు నిర్మాత దానయ్య సహరించారు."అన్నాడు చరణ్.

"నేను కష్టపడ్డానని అనుకుంటారు కానీ.. రకుల్ నాకు ఈక్వల్ గా చేసింది, తను చాలా కష్టపడింది" అంటూ హీరోయిన్ పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురింపించిన చరణ్.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి.. స్పెషల్ ధ్యాంక్స్ చెప్పాడు. నాయక్ లోని లైలా ఓ లాలా సాంగ్ ఇప్పటికీ తనకు ఫేవరేట్ సాంగ్ అంటూనే.. ఇందులో నాలుగు లైలాలు ఇచ్చావన్నాడు.

రిలీజ్ పై ఉన్న కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇస్తూ.. ఇంకా బ్రూస్ లీ సాంగ్ షూట్ చేయాల్సి ఉందని, అది మినహా.. మొత్తం పూర్తయిపోయిందని.. లేటెస్ట్ అప్డేట్ వివరించారు చెర్రీ. అయితే.. షూటింగ్ అయిపోయాక ఇంకెన్ని బాడీ పెయిన్స్ వస్తాయో అన్నాడు. ప్రస్తుతం అయ్యప్పమాలలో ఉండడంతో... మసాజ్ లు, లగ్జరీలు కూడా కుదరవుగా అంటూ జోక్ చేశాడు. బ్రూస్ లీ స్టోరీని వివరిస్తూ కన్నడలో పెద్ద హీరోయిన్ అయిన క్రితి తనకు అక్కగా చేసిందని.. హీరోయిన్ కంటే ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్ అంటూ వివరించాడు మెగాపవర్ స్టార్.

ఇక తండ్రితో స్క్రీన్ పంచుకోవడంపై అనుభవాన్ని కూడా వివరించాడు. ఆ ఐదు నిమిషాలు మెరుపులే అంటూ.. తన సినిమాలో చేసినందుకు నాన్నకు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాడు రామ్ చరణ్. ఇక చివరగా.. మీ అన్నయ్య మెగాస్టార్ మాట్లాడారని ఫ్యాన్స్ కి చెబ్తూ.. మైక్ చిరుకు ఇవ్వడం హైలైట్ గా నిలిచింది.
Tags:    

Similar News