చిరు యాక్షన్ పై చెర్రీ జాగ్రత్తలు

Update: 2017-11-14 10:28 GMT
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖాయమైపోయింది. డిసెంబర్ 6న సై రా నరసింహా రెడ్డి తొలి షెడ్యూల్ ను డిసెంబర్ 6న ప్రారంభించబోతున్నారు. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో.. అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్ర నిర్మాణం జరగనుంది.

ఇప్పటికే సై రా మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా ఫినిషింగ్ దశకు వచ్చేశాయి. పీరియాడిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం.. అత్యంత నిపుణులైన గ్రాఫిక్స్ టీంను తీసుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ గా.. యాక్షన్ స్టంట్ ట్రైనర్స్ ను నిర్మాత రామ్ చరణ్ రిక్రూట్ చేసుకున్నాడు. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు చాలానే ప్రాధాన్యం ఉండనుంది. పైగా.. మెగాస్టార్ కూడా పలు యాక్షన్ సీన్స్ ను చేయాల్సి ఉంటుంది. రీసెంట్ గా ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరు.. డ్యాన్సులలో ఇరగదీసేశారు. కానీ యాక్షన్ సన్నివేశాల్లో కొంత ఇబ్బంది పడ్డారనే టాక్ ఉంది. పైగా ఇప్పుడాయన 60ప్లస్ ఏజ్ లో ఉన్నారు.

ఈ వయసులో కూడా యాక్షన్ సీన్స్ పండించేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. కానీ ఈ మూవీకి నిర్మాత అయిన రామ్ చరణ్.. తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. స్టంట్ ట్రైనర్స్ ను రిక్రూట్ చేసుకున్నాడట. వీరు షూటింగ్ ఆసాంతం సెట్స్ లోనే ఉంటూ.. యాక్షన్ సీన్స్ ను పర్యవేక్షించడంతోపాటు.. పలు జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.
Tags:    

Similar News