లేటుగా అయినా లేటెస్ట్ గా వస్తానంటాడు రజినీకాంత్. కానీ కబాలి విషయంలో లేట్ అయితే జరిగింది కానీ.. లేటెస్ట్ గా మాత్రం రాలేకపోయాడు. తన సినిమా లేట్ గా స్టార్ట్ చేయడమే కాదు.. కబాలి మూవీని చూడ్డం లోనూ చెర్రీ లేట్ గానే ఉన్నాడు. రిలీజ్ అయిన పది రోజులకు.. మొత్తానికి కబాలి చూశాడు చెర్రీ. జూలై 31తో రామ్ చరణ్ కి తిరుగులేని హిట్ ఇచ్చిన మగధీర రిలీజ్ అయ్యి 7 సంవత్సరాలు గడిచింది. అందుకే ఆ రోజున సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్న చెర్రీ.. కబాలి మూవీ చూశాడు.
కబాలి చూస్తుండగానే 'కబాలి చూస్తున్నాను. తలైవా స్క్రీన్ పై కనిపించగానే వచ్చిన వెలుగులు నాకు తెగ ఉత్సాహం ఇస్తున్నాయి' అంటూ చెప్పుకొచ్చాడు చరణ్. అయితే.. ఇప్పటికే ఫ్లాప్ అని తేలిపోయినా.. రజినీ కోసం చెర్రీ సినిమా చూడ్డంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కానీ ప్రస్తుతం చెర్రీ కేవలం ఓ అభిమాని మాత్రమే కాదు. తన తండ్రి సినిమాకి నిర్మాత కూడా. రజినీ నటించిన సినిమాకి అనుసరించిన మార్కెటింగ్ టెక్నిక్స్ అందరికీ మైండ్ బ్లాంక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. చివరకు రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. అందుకే ఇటు మార్కెటింగ్ టెక్నిక్స్.. అటు సినిమా విషయంలో చేయకూడని పనులు.. ఈ రెండూ నేర్చుకునే ఛాన్స్ ని చెర్రీకి కబాలి ఇచ్చింది. అభిమానం.. ప్లస్ ప్రొడ్యూసర్ గా పాఠాలు నేర్చుకునే అవకాశం.. రెండింటినీ మిక్స్ చేసేసి ఉంటాడు చరణ్.
'కత్తిలాంటోడు' టైటిల్ రిజిస్టర్ చేయించిన తర్వాత.. చెర్రీలో ప్రొడ్యూసర్ బాగా యాక్టివ్ అయిపోయాడు సుమీ!