ఫిలింఫేర్ సుక్కూ కే అంకితం - చ‌ర‌ణ్

Update: 2019-12-23 09:10 GMT
అవార్డుల కోస‌మే న‌టించాలా? వాటంత‌ట అవే వ‌ర్క‌వుట‌వుతాయా? అంటే.. ఆ రెండో కేట‌గిరీ కి చెందిన న‌టుడిని అని అంటున్నారు రామ్ చ‌ర‌ణ్. అత‌డు న‌టించిన 2018 బ్లాక్ బ‌స్ట‌ర్ రంగ‌స్థ‌లం ప‌లు అవార్డు వేడుక‌ ల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ గా నిల‌వ‌డ‌మే గాక ప‌లు పుర‌స్కారాల్ని కొల్ల‌గొట్టింది. ఇటీవ‌ల ఫిలింఫేర్ సౌతిండియా అవార్డ్స్ లో ఉత్త‌మ న‌టుడిగా చ‌ర‌ణ్ అవార్డును అందుకున్న సంద‌ర్భంగా త‌నే స్వ‌యంగా ఈ సంగ‌తిని ప్ర‌స్థావించారు.

66వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుక‌ల్లో చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. త‌న‌కు ద‌క్కిన పుర‌స్కారం క్రెడిట్ పూర్తి గా ద‌ర్శ‌కుడు సుకుమార్ క్రియేటివిటీ కే చెందుతుంద‌ని అన్నారు. అవార్డు ను సుక్కూకే అంకిత‌మిస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. నిజానికి గోదారి యాస‌.. భాష‌.. సంస్కృతి పై క‌థ‌ను రాసుకుని అంత గొప్ప సినిమా తీసిన సుకుమార్ కి ఉత్త‌మ ద‌ర్శ‌కుడి గా అవార్డ్ రాక‌పోవ‌డం ఇప్ప‌టికీ అభిమానుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూనే ఉంది. అయితే మ‌హాన‌టి లాంటి ఛాలెంజింగ్ స‌బ్జెక్ట్ ఎంచుకున్న నాగ్ అశ్విన్ కి ఫిలింఫేర్ ఉత్తమ‌ ద‌ర్శ‌కుడు అవార్డ్ ఇవ్వ‌డం స‌రైన‌దేన‌న్న అభిప్రాయం మ‌రో వైపు వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక ఈ వేదిక‌పై చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ప్ర‌తిసారీ అభిమానుల కోసం కొత్త‌గా ఏదైనా చేయాల‌నే త‌పిస్తాను. అవార్డులు వాటంత‌ట అవే వ‌స్తాయ‌ని అన్నారు. ప్ర‌స్తుతం న‌టిస్తున్న‌ ఆర్.ఆర్.ఆర్ లో వంద శాతం బెస్ట్ ఇస్తాన‌ని తెలిపారు. అవార్డ్ వేడుక‌ల్లో చ‌ర‌ణ్ డౌన్ టు ఎర్త్ స్వ‌భావం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.
Tags:    

Similar News