రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరూ క్లాస్ మేట్స్. ఇద్దరూ కలిసి స్కూల్ డేస్ నుంచి కాలేజీ వరకు చదువుకున్నారు. చెర్రీ కూడా ‘నీకు స్కూల్ మేట్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారని’ అడిగితే శర్వా అని చెబుతుంటాడు. అలాంటి శర్వానంద్ నటించిన సినిమా రిలీజ్ అవుతుంటే చెర్రీ విషెష్ చెప్పకుండా వుంటాడా? తప్పకుండా అభినందనలు చెబుతాడు. ఇప్పుడు చెర్రీ అదే చేశాడు. శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 14న రిలీజ్ అవుతోంది.
ఈ చిత్రానికి ఇప్పటికే పబ్లిసిటీ బాగా జరిగింది. యూత్ లో పాజిటివ్ టాక్ తో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా రామ్ చరణ్.. ఎక్స్ ప్రెస్ రాజా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తన చిననాటి మిత్రుడు శర్వానంద్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మూవీ ట్రైలర్ బాగుందని, ఈ సినిమాను ఇంత బాగా నిర్మించిన యు.వి.క్రియేషన్స్ నిర్మాతలను అభినందించారు.