వరుణ్ తేజ్ కి విషెస్ చెప్పిన రామ్ చరణ్

Update: 2023-01-19 10:44 GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మెగాస్టార్ వారసత్వంతో హీరోగా అడుగుపెట్టిన కూడా వరుణ్ తేజ్ డాన్స్ ల పరంగా వీక్ అని చెప్పాలి. అందుకే బాబాయ్, పెదనాన్న, అన్నయ్య తరహాలో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కథలని ఎంపిక చేసుకోకుండా కాస్తా ప్రయోగాత్మక కథలు, యాక్షన్ థ్రిల్లర్ స్టోరీస్ ని ఎంపిక చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాడు.

వరుణ్ తేజ్ సినిమాలలో డాన్స్ లతో ఉండే డ్యూయెట్లు అస్సలు పెద్దగా ఉండవు. అయితే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం భాగా ఉండేలా చూసుకుంటారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. గాండీవదారి అర్జున అనే టైటిల్ ని ఈ మూవీకి ఖరారు చేశారు. పోస్టర్ లో ఒక చేత్తో గన్ పట్టుకొని మరో చేత్తో  రౌడీని క్రిందికి నెట్టి పట్టుకున్నాడు.

ఈ పోస్టర్ బట్టి ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నది అని అర్ధం అవుతుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ పోలీస్ కాప్ గా కనిపిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రత్యేకంగా విష్ చేశారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ కూడా వరుణ్ తేజ్ కి స్పెషల్ విషెస్ చేశాడు.అందులో చిన్న వయస్సులో వరుణ్ తేజ్ ని ఎత్తుకొని రామ్ చరణ్ తీసుకున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి విషెస్ చెప్పారు.

ఈ ఫోటో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది. వరుణ్ తేజ్, రామ్ చరణ్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ ఫోటో పెర్ఫెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది అంటూ మెగా అభిమానులు అందరూ కామెంట్ చేయడం విశేషం. ఇక రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ పై వరుణ్ తేజ్ కూడా రియాక్ట్ అయ్యి థాంక్స్ చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి బర్త్ డే రోజున కొత్త సినిమా పోస్టర్ తో పాటు అన్న రామ్ చరణ్ నుంచి కాస్తా ఇంటరెస్టింగ్ గా విశేష్ ని వరుణ్ తేజ్ అందుకోవడం  విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News