కోన మీద చెర్రీకి ఎంత కాన్ఫిడెన్సో..

Update: 2015-09-09 16:27 GMT
రామ్ చరణ్ ఎప్పుడూ మాస్ మసాలా సినిమాలే ఎందుకు చేస్తాడని చాలామందికి డౌటు. ఐతే ‘ఆరెంజ్’ లాంటి ప్రయోగాత్మక సినిమా మిగిల్చిన ఫలితమే అతడు మాస్ బాట పట్టడానికి కారణమైంది. ఆ తర్వాత కొంచెం క్లాస్ టచ్ ఉన్న కథలేవీ చరణ్ ఒప్పుకోలేదు. గత ఏడాది ‘గోవిందుడు అందరి వాడేలే’తో కొంచెం రూటు మార్చాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ‘బ్రూస్ లీ’తో మళ్లీ మాస్ మసాలా బాట పడ్డాడు చెర్రీ. ఐతే ఈ సినిమా తర్వాత కొంచెం రూటు మార్చాలని భావిస్తున్నాడు చరణ్. తమిళ స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో పని చేయడానికి అతను ఆసక్తి చూపుతున్నాడు. ఐతే గౌతమ్ సినిమాల్లో అదో రకంగా ఉంటాయి. ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కే నచ్చుతాయి. చరణ్ కు మంచి పాపులారిటీ ఉన్న మాస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లు ఆయన సినిమాలుండవు.

ఐతే గౌతమ్ తో పని చేయాలి, మాస్ ప్రేక్షకుల్నీ ఆకట్టుకోవాలి.. ఐతే ఏం చేయాలి? అందుకే కోన వెంకట్ సహకారం తీసుకోబోతున్నాడు చరణ్. కోన చేయి పడితే.. ఎలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా సరే.. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆమోదం పొందేలా తయారవుతుందని టాలీవుడ్ జనాలు నమ్ముతారు. అందుకే చాలా పెద్ద  సినిమాల్లో కోన హ్యాండ్ పడింది. శ్రీనువైట్లతో అతడికి పడదని తెలిసినా.. కోన చేయి పడాల్సిందే అని పట్టుబట్టి మరీ ‘బ్రూస్ లీ’కి రాయించుకున్నాడు చరణ్. ఆ  సందర్భంగా ఆయన పనితనం బాగా తెలుసుకున్న చరణ్.. గౌతమ్ తో సినిమాకు కూడా కోన సహకారం అవసరమని భావిస్తున్నాడు. ప్రస్తుతం కోన.. గౌతమ్ తో కలిసి స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ‘బ్రూస్ లీ’ విడుదలయ్యే సమయానికి స్క్రిప్టు ఓ కొలిక్కి వస్తుందని.. వెంటనే ఆ సినిమా మొదలుపెట్టేస్తారని సమాచారం.
Tags:    

Similar News