హైపర్ సినిమా రిజల్ట్ చాలా ఆనందాన్నిచ్చిందంటున్నాడు రామ్. ఈ సినిమా తనతో పాటు టీం సభ్యులందరికీ ఆనందాన్నిచ్చిందని.. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టిందని రామ్ చెప్పాడు. ముందు హైపర్ కథ చెప్పినపుడు సందేహాలు వ్యక్తం చేశానని.. కానీ తర్వాత తన అభిప్రాయం మారిందని రామ్ అన్నాడు.
‘‘డైరెక్టర్ వాసు ముందు ఈ సినిమా లైన్ చెప్పాడు.ఓ సంతకం చుట్టూ తిరిగే కథ అవసరమా అనిపించింది. ఐతే వారం తర్వాత మొత్తం స్క్రిప్టు చెప్పాడు. అప్పుడు ప్రభుత్వ అధికారి సంతకం విలువ తెలిసింది. ఈ సినిమా ఓ పరీక్ష అనుకుంటే నేను ఒక్కడినే కాకుండా మా క్లాస్ అంతా పాస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసిన వాళ్లందరూ ఇందులోని సన్నివేశాల గురించి మాట్లాడుతుండడం చాలా ఆనందంగా ఉంది’’ అని హైపర్ సక్సెస్ మీట్లో రామ్ చెప్పాడు.
డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నాకు హైపర్.. కందిరీగ కంటే ఎక్కువ సంతృప్తి ఇచ్చింది. హైపర్ ఎంత పెద్ద రేంజికి వెళ్తుందో అని చాలామంది అంటున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగానే ఉండాలి అనుకుంటాడు కానీ కొన్ని పరిస్థితుల వలన అవినీతి వైపు అడుగులు వేస్తుంటాడు. ఇదే మా సినిమాలో చూపించడంతో అందరికీ కనెక్టయింది. ఈ సినిమా చూసిన ఓ ఐఏఎస్ అధికారి నాకు ఫోన్ చేసి అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది’’ అని చెప్పాడు.