దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను మార్చ్ 29 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ సినిమా వివాదాస్పదం కావడంతో టీడీపీ నాయకుడు పీ. మోహన్ రావు.. న్యాయవాది నువ్వారి శ్రీనివాసరావు సినిమా విడుదలను ఆపాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యే వరకూ రిలీజ్ పై కోర్టు స్టే విధించింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టీమ్ దీనిపై అప్పటినుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఎపీలో ఇప్పుడు ఎలెక్షన్స్ పూర్తయ్యాయి కాబట్టి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మే 1 న రిలీజ్ అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ పోస్టర్ ను షేర్ చేశాడు. దీనికి తోడుగా "ఫైనల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ మే1 న ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ అవుతోంది. మీరందరూ వచ్చి ఎన్టీఆర్ వెనక జరిగిన కుట్రలను వచ్చి చూడండి" అంటూ ట్వీట్ చేశాడు.
వర్మ మే 1 న విడుదల అని చెప్తున్నా నిజంగా విడుదల అయ్యే వరకూ నమ్మకం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పోలింగ్ బూత్ లలో రీ-పోలింగ్‌పై జరుపుతారా లేదా అనే విషయంలో ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ రావలసి ఉంది. మరి ఈ కారణం సాకుగా చూపి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలను అడ్డుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏ విషయం మనకు ఒకటి రెండ్రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.